వచ్చే నెలలో రాష్ట్రానికి అమిత్ షా

Updated By ManamTue, 05/08/2018 - 05:55
amith sha
  • 2019లో తెలంగాణలో అధికారం మాదే.. ఎవరెన్ని కుట్రలు చేసినా కర్ణాటకలో గెలుస్తాం

  • కాంగ్రెస్ కంటే 3 రెట్లు ఎక్కువ నిధులిచ్చాం.. ‘తెలుగు’ సీఎంలు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

  • టీడీపీ నేతల తీరుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ 

amith shaహైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అ మిత్ షా జూన్‌లో తెలంగాణలో పర్యటిస్తారని  ఆ పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. ఈ మేరకు ఈ నెల 14న ఢిల్లీలో పార్టీ రాష్ట్ర ప్రముఖులు అమిత్ షాతో సమావేశమవుతారని, తెలంగాణలో అధికారంలోకి రావడానికి చేపట్టాల్సిన వ్యూహాలు చేస్తామని వివరించారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. షా పర్యటనను పురస్కరించుకు ఈ నెల 17, 18 తేదీల్లో బీజేపీ జాతీయ సంఘటన కార్యదర్శి సతీష్‌జీ పార్టీ నేతలతో సమావేశమవుతారని చెప్పారు. 2019 ఎన్నికల్లో ెతెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిందని తెలుగు రాష్ట్రాల సీఎంలు  పదేపదే విమర్శలు చేస్తున్నారని, నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని లక్ష్మణ్ సవాల్ విసిరారు. గత కాంగ్రెస్ ఇచ్చిన నిధుల కంటే  మూడు రెట్లు అధికంగా ఇచ్చామని, అయినా సొంత ప్రయోజనాల కోసం కేంద్రంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు, భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్లకు అన్ని రకాల అనుమతులు వెంటనే మంజూరు చేసిన విషయం గుర్తుంచుకుకోవాలన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని మనోవేదనకు గురై సూర్యాపేట జిల్లాకు చెందిన వెంకటరమణ ఆత్మహత్యకు పాల్పడ్డాడని వాపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. పెట్రోల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి వస్తే సగం భారం తగ్గుతుందని, ఇందుకు రాష్ట్రాలు సహకరించ డం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను కర్ణాటకలో కాపీ కొట్టిందని ఆరోపిస్తున్నారని, కల్యాణలక్ష్మి లాంటి పథకం మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారని చెప్పారు. దేవాదాయ శాఖలో నిధులు పక్కదారి పడుతున్నాయని, ఆ నిధులను దేవాలయాల అభివృద్ధికే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ ప్రత్యేక బృందాలను కర్ణాటకకు పంపించి మరింత దిగజారిపోయిందని, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.15వేల కోట్లతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివిధ రహదారుల పనులకు శంకుస్థాపనలు చేశారని, అదనంగా రూ. రూ. 10వేల కోట్ల మంజూరుకు ప్రకటన చేశారని చెప్పారు. జల రవాణాపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఈ సమావేశంలో  కృష్ణసాగర్, ఎన్వీ సుభాష్, సుధాకర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags
English Title
Amit Shah to the state next month
Related News