అనగనగా ఓ రాజకుమారుడు పాటలు

Updated By ManamWed, 09/26/2018 - 01:49
Audio Release

imageనవీన్‌బాబు, సంజన జంటగా షేర్ దర్శకత్వంలో రామ్‌సాయి గోకులం క్రియేషన్స్ పతాకంపై పి.వి.రాఘవులు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఓ రాజకుమారుడు’. ఈ చిత్రంలోని పాటలు ప్రసాద్ ల్యాబ్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు ఆడియో సీడీని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రీడా సంఘం చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్‌లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా లింగంపల్లి కిషన్‌రావు మాట్లాడుతూ ‘‘మంచి టైటిల్ పెట్టారు. పాటలు బాగున్నాయి. మా నిర్మాత రాఘవులుకు సినిమా అంటే చాలా ఇష్టం. సమాజానికి మంచి సందేశాత్మక చిత్రాలు అందించాలన్న లక్ష్యంతో ఉన్నారు. తప్పకుండా ఈ సినిమా సూపర్‌హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. 

English Title
anaganaga o rakumarudu movie songs relese
Related News