వీడియో చూస్తూ వ్యక్తి డ్రైవింగ్.. పోలీసులకు రంగమ్మత్త ట్వీట్

Updated By ManamThu, 07/19/2018 - 09:51
anasuya

Anasuya ఇటు బుల్లితెర, అటు వెండితెర మీద రాణిస్తున్న హాట్ బ్యూటీ అనసూయ తాజాగా సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. కారులో ఓ వ్యక్తి వీడియో చూస్తూ డ్రైవింగ్ చేస్తుండగా.. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న అనసూయ.. ‘‘డియర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్. ఇలాంటి సంఘటనలు నన్ను భయపెడుతాయి. ఎవరో తప్పిదం వలన నేను ఇంతకుముందే యాక్సిడెంట్‌కు గురయ్యాను. ఇలాంటి వారు అసలు వదలకండి. రోడ్డు మీద ప్రయాణించే వారి ప్రాణాలు తీయడానికి వీరికి ఎలాంటి హక్కు లేదు. ప్లీజ్ సర్’’ అంటూ కామెంట్ పెట్టింది. దీనిని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేసింది. అయితే దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘వీడియో తీసే బదులు, ఒక్క నిమిషం కిందికి దిగి చెప్పొచ్చు కదా’’, ‘‘అక్కడ ట్రాఫిక్ ఉంది. అతడేమీ వీడియో చూస్తూ ర్యాష్ డ్రైవ్ చేయలేదు. ట్రాఫిక్‌లో ఆగిపోయాడు కాబట్టే వీడియో చూస్తుండచ్చు’’, ‘‘ఇదంతా ఫేమ్ కోసం చేస్తున్నారని బాగా అర్థమవుతుంది’’, ‘‘మీ సోషల్ రెస్పాన్సిబులిటీకి హ్యాట్సాఫ్’’ ఇలా పలురకాలుగా కామెంట్లు పెడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఇలాంటి ట్వీట్లు పెట్టడం కొత్తేమీ కాదు. ఈ మధ్యనే ఒక వ్యక్తి కారులో నుంచి చెత్తను తీసి రోడ్డు మీద వేసినందుకు గానూ అనుష్క శర్మ వారిని తిట్టిన విషయం తెలిసిందే. దానికి అతడు ఘాటుగా స్పందించాడు.

 

English Title
Anasuya tweet to Hyderabad Traffic Police
Related News