సోషల్ మీడియాకు అనసూయ స్వస్తి?

Updated By ManamWed, 02/07/2018 - 18:12
Anchor Anasuya, Anasuya Social media accounts, TV anchor Anasuya, 

Anchor Anasuya, Anasuya Social media accounts, TV anchor Anasuya, హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్ అనసూయ సోషల్ మీడియాకు ఇక స్వస్తి పలికినట్టు కనిపిస్తోంది. తనతో ఫోటో తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ బాలుడి ఫోన్‌ను పగలగొట్టారంటూ అనసూయపై అతడి తల్లి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ట్విట్టర్ వేదికగా అనసూయ వివరణ ఇచ్చుకున్నప్పటికీ.. ఈ ఘటనకు సంబంధించి పలువురు నెటిజన్ల నుంచి కామెంట్లు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. విపరీతంగా కామెంట్లు వస్తుండటంతో విసుగుచెందిన అనసూయ సోషల్ మీడియా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు సోషల్ మీడియాలో కనిపించడం లేదు. గతంలో కూడా కొందరు సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారని అనసూయ వాపోయిన సంగతి విదితమే. 
(..అనసూయ గలీజు మాటలు మాట్లాడింది..)
(..యాంకర్ అనసూయపై పోలీసు కేసు..)
(..ఫోన్ పగలగొట్టిన ఘటనపై అనసూయ స్పందన..)

English Title
Anchor Anasuya left out from Social media accounts
Related News