మరో బిగ్ ఫైట్

Updated By ManamSun, 09/23/2018 - 06:00
india pakistan cricket
  • నేడు ఇండియా, పాకిస్థాన్ సూపర్-4 మ్యాచ్  

దుబాయ్: ఆసియా కప్‌లో మరోసారి ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఆదివారం ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్నా యి. పాకిస్థాన్ జట్టు కూడా బలమైందే కాబట్టి టీమిండియా ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడం లేదు. అంచనాలకు అందని పాకిస్థాన్ ఎప్పుడైన టీమిండియా షాకిచ్చే అవకాశముంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలని టీమిం డియా భావిస్తోంది. అయితే అఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌లో ఎక్కడ ఓడిపోతామో అని భయపడ్డ పాకిస్థాన్ తన ఆట తీరును మెరుగు పరచుకోవాలని పట్టుదలగా ఉంది. గ్రూప్ దశ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా 8 వికెట్లతో ఓడించిన సంగతి తెలిసిందే.

image


తొలి మ్యాచ్‌లో పసి కూనలు హాంకాంగ్‌పై గెలిచేందుకు చెమటోడ్చిన టీమిండియా ఆ తర్వాత పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కలిసి కట్టుగా రాణించి సర్ఫరాజ్ అహ్మద్ సేనను తక్కువ పరుగులకే అవుట్ చేసింది. చిన్న లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అజేయ సెంచరీతో జట్టును ఒడ్డుకు చేర్చాడు. ఇంకా 21 ఓవర్లు మిగిలి ఉండగానే మెన్ ఇన్ బ్లూ విజయం సాధించారు. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ టోర్నీకి దూరమైనప్పటికీ భారత బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. అంతేకాదు స్ట్రోక్ ప్లేకు అంతగా సరిపోయే పిచ్‌కాకపోయినప్పటికీ ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడుతున్నారు. 

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తాత్కాలిక కెప్టెన్ రోహిత్ బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ అజేయ అర్ధ సెంచరీ చేశాడు. దీంతో 7 వికెట్లతో టీమిండి యా గెలిచింది. ఇంగ్లాండ్‌లో పరుగులు సాధించేందుకు అష్టక ష్టాలు పడ్డ రోహిత్ ఓపెనింగ్ భాగస్వామి శిఖర్ ధావన్ ఈ టోర్నీలో ఫామ్‌లోకి వచ్చాడు. హాంకాంగ్‌పై సెంచరీతో పాటు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారించాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ధీటుగా ఆడిన మిడిర్డర్ ద్వయం అంబటి రాయుడు, దినేష్ కార్తీక్‌లకు ఈ మ్యాచ్‌లోనూ చోటు దక్కే అవకాశముంది. పాకిస్థాన్‌పై అజేయ 31 పరుగుల చేసిన రాయుడు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ఎట్టకేలకు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కాసేపైనా క్రీజులో ఉండి 37 బంతుల్లో 33 పరుగులు చేశాడు. కేదార్ జాదవ్ బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ తన సత్తా నిరూపించుకున్నాడు. 

imageచాలా కాలం తర్వాత మళ్లీ వన్డే జట్టులో చోటు సంపాదించిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బంగ్లాతో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి తనతో ప్రతిభ తగ్గలేదని నిరూపించాడు. ఈ ఎడమ చేతి స్పిన్నర్ పాకిస్థాన్ బ్యాటింగ్‌కు ముప్పుగా మారనున్నాడు. అంతేకాకుండా లోయర్ ఆర్డర్‌లో టీమిండియాకు అండగా నిలవనున్నాడు. ఈ మ్యాచ్‌లో పేస్ ద్వయం భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి శుభారంభాన్ని అందిస్తారని టీమిండియా ఆశిస్తోంది. యజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్ టీమిండియాకు ప్రధాన స్పిన్ ఆయుధాలుగా ఉన్నారు. అయితే పాకిస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కేదార్ స్పిన్నర్లలో ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. 

ఇక పాకిస్థాన్ విషయానికొస్తే.. సీజనల్ ఆటగాడు షోయబ్ మాలిక్‌పై ఆధారపడింది. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో మాలిక్ 43 పరుగులు చేసి జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించాడు. అంతేకాదు అఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ అతను కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. గతేడాది చాంపియన్‌షిప్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాపై మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేసిన ఓపెనర్ ఫఖర్ జమాన్ ఈ టోర్నీలో విఫలమయ్యాడు. దీంతో బాబర్ ఆజాం, సర్ఫరాజ్, ఇమామ్ ఉల్ హక్‌లపైనే పాక్ జట్టు ఆధారపడింది. మరోవైపు ప్రధాన బౌలర్ మహ్మద్ ఆమీర్ ఫామ్‌లో లేకపోవడం పాకిస్థాన్‌ను కలవరపెడుతున్న అంశం. ఇటీవల అతను వికెట్లు తీయడంలో విఫలమవుతున్నాడు. టీమిండియాతో మ్యాచ్‌లో అతను ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో అఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌కు డ్రెస్సింగ్ రూమ్‌కు పరిమితమయ్యాడు. దీంతో ఇప్పుడు టీమిండియాతో మ్యాచ్‌లో పాక్ జట్టును గెలిపించే బాధ్యతల హసన్ అలీ, ఉస్మాన్ ఖాన్‌లపై పడింది. 

అదే దూకుడు కొనసాగిస్తాం: రోహిత్
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సహచరుల ప్రతిభను ప్రశంసించిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్-4లోimage భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లోనూ అదే దూకుడు ప్రదర్శిస్తామని అన్నాడు. పునఃప్రవేశ ఆటగాడు రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీసుకోవడంతో పాటు రోహిత్ శర్మ చూడచక్కని బ్యాటింగ్ చేయడంతో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్లతో గెలుపొందింది. ‘ఆరంభం నుంచి అద్భుత ప్రతిభ కనబరిచాం. బాగా బౌలింగ్ చేశాం. ఫ్లడ్ లైట్ల వెలుతురులో బ్యాటింగ్ చేయడం మంచిదన్న విషయాన్ని మేము ముందే గుర్తించాం. ప్రతి ఒక్కరూ బాగా ఆడారు. ఇటువంటి పిచ్‌లపై బౌలర్లను మార్చి మార్చి బౌలింగ్ చేయించడం చాలా అవసరం. షార్ట్ స్పెల్స్ వేయించి బౌలర్లను రొటేట్ చేయలనుకున్నాం. ఈ ఆలోచన ఒక సవాల్‌తో కూడుకున్నది. అయితే బౌలర్లు కూడా బాగా స్పందించారు. ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ పాటిస్తే ఖచ్చితంగా వికెట్లు పడతాయని మాకు తెలుసు. చాలా కాలం తర్వాత జడేజా వన్డే మ్యాచ్ ఆడాడు. అయినప్పటికీ అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఫలానా వ్యక్తి అని కాకుండా అందరూ సత్తా చాటారు’ అని రోహిత్ శర్మ అన్నాడు. 

English Title
Another Big Fight
Related News