జేపీకి మరో డైరెక్టర్ రాజీనామా

Updated By ManamSun, 09/23/2018 - 22:42
jaypee

jaypeeన్యూఢిల్లీ: అప్పుల్లో కూరుకు పోయిన జేపీ ఎన్‌ఫ్రాటెక్ స్వతంత్ర డైరెక్టర్ శ్యాం లాల్ మోహన్ వ్యక్తిగత కారణాలతో బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు సంస్థ ఇటీవల వెల్లడించింది. ఇదే నెలలో మరో ముగ్గురు ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు లలిత్ బాసిన్, కేశవ్ ప్రసాద్ రావ్, బసంత్ కుమార్ గోస్వామిలు రాజీనామా చేశారు. గోస్వామి ఆయన వయస్సు మీద పడటంతో, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశారు. బోర్డు డైరెక్టర్ పదవి నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు శ్యాం లాల్ మోహన్ తెలిపారని కంపెనీ బీఎస్‌ఈకి నివేదించింది. కమిటీ ఆఫ్ కో-ఆర్డినేటర్స్ తడుపరి సమావేశంలో తాత్కాలిక వృత్తి నిపుణున్ని వారి స్థానాల్లో నియమించేందుకు  అనుమతించేన్నారు.   కంపెనీ రుణ దాతా ఐడీబీఐ ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్ట్స్రీ కింద జేపీ ఎన్‌ఫ్రాటెక్ పరిష్కారానికి ఐడీబీఐ  నేథృత్వంలోని కన్సార్షియంను జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) స్వీకరించింది. అది కంపెనీ వ్యాపార నిర్వహణకు అర్జున్ జైన్‌ను తాత్కాలిక వృత్తి నిపుణుడిగా నియమించింది. ఆయన నోయిడా, గ్రేటర్ నోయిడాల్లో నిలిచిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను స్వాధీనం చేసుకునేందుకు బిడ్‌లను ఆహ్వానించారు. అందులో లక్షద్వీప్‌సంస్థ  జేపీ ఇన్‌ఫ్రాటెక్ స్వాదీనానికి ముందు వరసలో నిలిచింది. అయినప్పటికి ఈ ఏడాది మేలో లక్షద్వీప్ నుంచి రూ. 7,350 కోట్లతో వచ్చిన బిడ్‌ను జేపీ ఇన్‌ఫ్రాటెక్ తిరస్కరించింది. లక్షద్వీప్ సంస్థ సుధీర్ వాలియాకి చెందిన సురక్ష అసెట్ రీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ, ముంబై కేంద్రంగా ఉన్న దోస్తీ రియాల్టిల జాయింట్ వెంచర్. జేపీ ఎన్‌ఫ్రాటెక్ దాదాపు రూ. 9,800 కోట్ల రుణాలను కలిగి ఉంది. ఇందులో ఒక్క ఐడీబీఐ బ్యాంక్‌కే రూ. 4,334కోట్లు బాకీ ఉంది. మిగతా ఐఐఎఫ్‌సీఎల్, ఎల్‌ఐసీ,ఎస్‌బీఐ, కార్పొరేషన్ బ్యాంక్, సిండికేట్ బ్యంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐసీఐసీఐ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఐఎఫ్‌సీఐ, జే అండ్ కే బ్యాంకు, యాక్సిస్ బ్యాంకుతో పాటు శ్రేయ్ ఎక్విప్‌మెంట్ ఫినాన్స్ లిమిటెడ్ వంట సంస్థలకు రుణాలు చెల్లించాల్సి ఉంది.  జేపీ ఎన్‌ఫ్రాటెక్ జేపీ గ్రూప్ ఫ్లాగ్ షిప్ సంస్థ జయప్రకాశ్ అసోషియేట్స్ 32,000 ఫ్లాట్‌లను నిర్మించేందుకు కాంట్రాక్టుకు పొందింది. అందులో 9,500 ఫ్లాట్లను ఇప్పటికే అందించింది. కొనుగోలు దార్లకు తిరిగి చెల్లించేందుకు రూ. 750 కోట్లు రిజిస్ట్రీ ఆఫ్ సుప్రీం కోర్టుకు సమర్పించింది.

English Title
Another director resigned to JP
Related News