‘అంతకు మించి’ భయపెట్టే సినిమా

Updated By ManamTue, 08/21/2018 - 01:20
rashmi

imageఎస్ జై ఫిలిమ్స్ పతాకంపై యూ అండ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పిస్తున్న చిత్రం ‘అంతకు మించి’. జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 24న విడుదలవుతుంది. ఈసినిమా టైటిల్ సాంగ్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు జానీ మాట్లాడుతూ ‘‘దర్శకుడిగా నా తొలి చిత్రమిది. సినిమా పోస్టర్స్ విడుదలైన తర్వాత అందరూ రష్మీ ఎక్స్‌పోజింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. రేపు సినిమా విడుదలైన తర్వాత ఆమె పెర్‌ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటారు.

హీరో జైగారు నిర్మాతగా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నటన పరంగా క్యారెక్టర్‌లో ఒదిగిపోయారు. ఈ సినిమాతో మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటారు’’ అన్నారు. హీరో, నిర్మాత జై మాట్లాడుతూ ‘‘సినిమా లాస్ట్ టూ రీల్స్‌లో ఆడియన్స్ కచ్చితంగా భయపడతారు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో టైటిల్ పడుతుంది. ‘అంతకు మించి’ అని అప్పుడు అర్థం అవుతుంది నైజాంలో వంద థియేటర్స్‌లో సినిమా విడుదలవుతుంది.

100 శాతం సక్సెస్ అవుతుంది’’ అన్నారు. హీరోయిన్ రష్మీ మాట్లాడుతూ ‘‘సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. జై హీరోగా, నిర్మాతగా అందించిన సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమా కేక్‌లా డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో ఉంటుంది. 24న విడుదలవుతున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

English Title
'anthaku minchi' is a scary movie
Related News