నాగ‌చైత‌న్య‌తో అను ఇమ్మాన్యుయేల్‌?

Updated By ManamTue, 11/14/2017 - 12:38
naga, anu

maruthi, anu, chaituయువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం 'స‌వ్య‌సాచి' సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కాగా, ఈ చిత్రం త‌రువాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చైత‌న్య ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'శైల‌జా రెడ్డి అల్లుడు' అనే పేరు వినిపిస్తోంది. సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు. తాజాగా వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం ఈ సినిమాలో కేర‌ళ‌కుట్టి అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశ‌ముంద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ 25వ చిత్రంతో పాటు అల్లు అర్జున్ 'నా పేరు సూర్య‌'లోనూ అను హీరోయిన్‌గా న‌టిస్తోంది.

English Title
anu emmanuel with naga chaitanya?
Related News