ఏపీకి అవార్డుల పంట

Updated By ManamTue, 09/11/2018 - 23:20
Narendra Singh Tomar
  • గ్రామీణాభివృద్ధి శాఖకు 10 అవార్డులు.. కేంద్ర ప్రభుత్వం నుంచి స్వీకరణ 

Narendra Singh Tomarన్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖకు అవార్డుల పంట పండింది. రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో సాధించిన పురోగతికి గాను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 10 అవార్డులు అందజేసింది. మంగళవారం ఢిల్లీలో విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నుంచి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి తదితరులు అవార్డులు స్వీకరించారు. మొత్తం 15 కేటగిరిలకు గాను ఏపీలో 9 కేటగిరిల్లో గ్రామీణాభివృద్ధి శాఖ 10 అవార్డులుమవులులో రెండోస్థానం, ఎక్కువ పనులు పూర్తి చేసిన రాష్ట్రాలలో మూడో స్థానం, సుపరిపాలన అమలులో మూడోస్థానం, బీఎఫ్‌టీ ప్రాజెక్టు అమలులో రెండోస్థానం సాధించింది. ఇక ఈ పథకం అమలులో విశాఖపట్నం, ప్రకాశం ఉత్తమ జిల్లాలుగా ఎంపికయ్యాయి. వ్యక్తిగత అవార్డులలో భాగంగా వంద శాతం ఆస్తుల జియో ట్యాగింగ్ చేసిన కర్నూలు జిల్లా, ఉత్తమ గ్రామ పంచాయతీ కేటగిరిలో చిత్తూరు జిల్లా కోటబయలు ఎంపికయ్యాయి. ఏటా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అందజేస్తున్న అవార్డులలో మూడేళ్లుగా ఏపీ అత్యధికంగా సాధిస్తుండటం విశేషం. 

English Title
AP Awards Crop
Related News