కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం

Updated By ManamWed, 02/21/2018 - 12:46
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

 కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదంఅమరావతి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం లభించింది. ఉదయం ప్రారంభమైన సమావేశం ఇంకా కొనసాగుతోంది. కాగా గురువారం ఢిల్లీకి రావాలని కేంద్రం హోం శాఖ నుంచి లేఖ రావడంతో రాష్ట్ర విభజన, అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పనపై చర్చ జరగనుంది. ముఖ్యంగా మంత్రులు, అధికారులు కేంద్రంతో ఎలా పొసగాలన్న విధివిధానాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా విశాఖలో భాగస్వామ్య సదస్సు, రేపటి కియా శంకుస్థాపన కార్యక్రమంపై కూడా నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కీలక నిర్ణయాలివే..

  • ప్రభుత్వ ఉద్యోగులకు 2.096 శాతం డీఏ చెల్లింపునకు ఆమోదం

  • 2017 జనవరి నుంచి 2018 మార్చి 31వరకు డీఏ చెల్లింపు 

  • ప్రభుత్వంపై రూ.1048.60 కోట్ల భారం

  • ఏసీబీలో 350 పోస్టుల మంజూరుకు ఆమోదం

  • పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ పనులు చేపట్టిన నవయుగకు రూ.1,244 కోట్ల పరిపాలన అనుమతులకు ఆమోదం

  • గన్నవరం కోర్టులో 25 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం

English Title
AP Cabinet approval for key decisions | Key Decisions taken in AP Cabinet Meet
Related News