త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ: చంద్రబాబు

Updated By ManamMon, 09/03/2018 - 21:14
AP Cabinet, AP CM, Chandrababu Naidu 

AP Cabinet, AP CM, Chandrababu Naidu అమరావతి: ఏపీ మంత్రివర్గ విస్తరణ త్వరలో చేపట్టనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సినీ నటుడు హరికృష్ణ మరణంతో విస్తరణ కొంచెం ఆలస్యమైందని అన్నారు. సీపీఎస్‌ విధానం జాతీయ స్థాయిలో తీసుకున్న విధాన నిర్ణయమని చంద్రబాబు చెప్పారు.

అన్ని రాష్ట్రాల్లోనూ సీపీఎస్‌ విధానం ఉందని గుర్తు చేశారు. దీన్ని ఏవిధంగా పరిష్కరించాలో ఆలోచిస్తున్నామని సీఎం తెలిపారు. డిసెంబర్‌ నాటికి హైకోర్టు భవనం పూర్తవుతుందని స్పష్టం చేశారు. హైకోర్టు ఏర్పాటు విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని చంద్రబాబు తెలిపారు. 

English Title
AP Cabinet to be expansioned soon, says AP CM Chandrababu Naidu 
Related News