గణతంత్ర వేడుకలకు చంద్రబాబు గైర్హాజరు

Updated By ManamFri, 01/26/2018 - 11:34
Flight Problem

Ap Cmఅమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. గురువారం సాయంత్రంతో బాబు పర్యటన ముగిసింది. అయితే శుక్రవారం ఉదయం దావోస్ నుంచి తిరుగు పయనమై ఏపీలో జరుతున్న రిపబ్లిక్ వేడుకల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్యకారణాల వల్ల అమరావతికి రాలేకపోయారు. చంద్రబాబు ఇండియాకు రావాల్సిన విమానం పొగమంచు కారణంగా ఆలస్యమవ్వడంతో ఆయన రాలేకపోయారు. దీంతో చంద్రబాబు అధికారిక నివాసంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

ఇదిలా ఉంటే శుక్రవారం 12గంటల లోపు గవర్నర్ విజయవాడకు చేరుకుని జాతీయ జెండా ఆవిష్కరించి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ఆయన ప్రసంగించనున్నారు. కాగా చంద్రబాబు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. నాలుగు రోజుల దావోస్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు బృందం పలు కీలక సంస్థల ప్రతినిధులతో సమావేశమై, కీలక ఒప్పందాలపై సంతకాలు చేసింది.

English Title
AP CM Chandrababu did not attend to republic day celebrations Due To Flight Problem
Related News