తిరుమల వెంకన్నకు కాపలా కాసింది చంద్రబాబే: లోకేశ్

Updated By ManamTue, 05/22/2018 - 19:29
​​AP CM, chandrababu naidu, Tirumala temple, Lokesh babu

AP CM, chandrababu naidu, Tirumala temple, Lokesh babu విశాఖపట్నం: తిరుమలలోని వెంకన్నస్వామివారికి అహర్నిషలూ కాపలా కాసింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఏడుకొండల జోలికి వస్తే మాడి మసైపోతారని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించింది చంద్రబాబేనని ఆయన గుర్తుచేశారు. టీడీపీ ఆధ్వర్యంలో మంగళవారం విశాఖపట్నంలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో లోకేశ్‌ తనదైన శైలిలో ప్రసంగించారు. ‘‘విభజన హామీలు, ప్రత్యేక హోదా పోరాటం నుంచి అందరి దృష్టిని మరల్చడానికే బీజేపీ నేతలు వెంకన్నను దించారు. టీటీడీలో అన్యాయాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. మనలో ఐక్యతను కూలగొట్టడానికే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. అసలు వెంకన్నకు అహర్నిషలు కాపలా కాసింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారే. 68 ఏళ్ల వయసులో ఇంతగా కష్టపడుతున్న ఆయనకు.. హోదా ఇచ్చి ప్రోత్సహించాల్సిన బీజేపీ రాజకీయాలు చేస్తోంది. 2019లో చంద్రబాబు పిలుపు మేరకు జనమంతా బీజేపీకి సినిమా చూపిస్తారు’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

English Title
AP CM chandrababu naidu protected Tirumala temple every time, says Lokesh babu
Related News