ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు: బాబు

Updated By ManamFri, 09/07/2018 - 13:52
AP CM Chandrababu Teleconference With ministers, chief whip
AP CM Chandrababu Teleconference With ministers, chief whip

అమరావతి: ప్రతిపక్షం లేకపోయినా అసెంబ్లీ సమావేశాలు బాగా జరిగాయని పేరు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  మంత్రులు,విప్‌లు, పార్టీ బాధ్యులు  పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...ప్రతిపక్షం లేకపోయినా అసెంబ్లీ బాగా జరిగిందనే పేరు రావాలి. 

ప్రతిపక్షం కోసం మనం పనిచేయడం లేదు. ప్రజల కోసం మనం పనిచేస్తున్నాం. ప్రజలు అన్నింటిని నిశితంగా గమనిస్తున్నారు. మన ప్రజలంతా సానుకూల దృక్ఫథం గలవారు. ప్రతికూల స్వభావాన్ని ప్రజలు సహించరు. బాధ్యతారాహిత్యాన్ని మన ప్రజలు అసలే సహించరు. అసెంబ్లీకి ఎందుకు వెళ్లరని ప్రతిపక్షాన్ని ఉపాధ్యాయులు ఇటీవలే నిలదీశారు. దానికి సమాధానం చెప్పలేని స్థితిలో వైకాపా నేతలు పడిపోయారు. 

అన్నివర్గాల ప్రజల్లో ప్రతిపక్షంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రాథమిక బాధ్యతలను ప్రతిపక్షం వైకాపా విస్మరించింది. సభకు హాజరుగాని సభ్యత్వం వృధా. ప్రతి సమావేశానికి హాజరు కావడం సభ్యుడి ప్రాథమిక బాధ్యత. మన ప్రతి కదలికను ప్రజలు బేరీజు వేస్తున్నారు. సభకు రాని సభ్యుల పేర్లు ఎప్పటికప్పుడు తెలియజేయాలి. ప్రశ్నలు వేయడం,స్వల్పకాలిక,దీర్ఘకాలిక చర్చలు అర్ధవంతంగా జరగాలి.

ఈ రోజు అసెంబ్లీలో నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చ అర్ధవంతంగా జరపాలి. కౌన్సిల్‌లో రాజధాని నిర్మాణంపై చర్చలో అందరూ పాల్గొనాలి. అనుబంధ ప్రశ్నల ద్వారా లోతైన చర్చ జరిగేలా శ్రద్ధ చూపాలి. విషయ పరిజ్ఞానంతో వాస్తవాలను ప్రజల్లోకి పంపాలి. ప్రతిపక్షం ఉన్నప్పుడే వ్యూహాలు ఉండటం కాదు. ప్రజలను  మెప్పించే వ్యూహాలు ఉండాలి.’ అని పేర్కొన్నారు.

English Title
AP CM Chandrababu Teleconference With ministers, chief whip
Related News