కిదాంబి శ్రీకాంత్‌కు డిప్యూటీ కలెక్టర్ పదవి

Updated By ManamThu, 03/22/2018 - 07:53
Srikanth

Srikanth అమరావతి: ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ బుధవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతేడాది ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ను కైవసం చేసుకున్న శ్రీకాంత్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రూపు-1 ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఆ హామీ మేరకు క్రీడా కోటా ద్వారా శ్రీకాంత్‌ను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు నంబరు 136ను జారీ చేసింది. త్వరలోనే శ్రీకాంత్ ఆ పదవికి బాధ్యతలు తీసుకోనున్నారు.

English Title
AP government passes G.O for Kidambi Srikanth's Diputy Collector post
Related News