క్షమాపణలు చెప్పిన ఏపీ మంత్రి

Updated By ManamMon, 05/28/2018 - 00:08
somi
  • తప్పుగా మాట్లాడాను.. క్షమించండి

  • వైసీపీ నేతలను అనబోయి.. రమణ దీక్షితులను అన్నాను: సోమిరెడ్డి

somireddyవిజయవాడ : టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితు లుపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదా స్పదం కావడంతో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఆదివారం విజయవాడలో ప్రారంభమైన టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడారు. ‘తప్పుగా మాట్లాడాను.. క్షమించండి’ అని అన్నారు. ‘రమణదీక్షితులు గారిని ఉద్దేశించి అన్న మాటలకు క్షమాపణలు చెబుతున్నాను. బ్రాహ్మణుల ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. అందుకే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. నిజానికి నేను వైసీపీ నాయకులను విమర్శించాలనుకుని రమణ దీక్షితులును అనేశాను. అయినా, ముఖ్యమంత్రి ఇంట్లో శ్రీవారి నగలు ఉన్నాయని ఎవరైనా ఆరోపిస్తే.. తెలంగాణలో అయితే ఖచ్చితంగా బొక్కలోవేసి ఇంటరాగేషన్ చేసేవారు. అసలు వేంకటేశ్వర స్వామి నగల గురించి మాట్లాడినందుకు శిక్షించేవారు’’ అని సోమిరెడ్డి వివరించారు.

English Title
AP Minister Apologies to public
Related News