బ్రాహ్మణులకు సముచిత స్థానం

Updated By ManamMon, 09/10/2018 - 23:54
jagan
  • దేవుని ముందూ బాబు అబద్ధాలు చెబుతారు

  • బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ జగన్

jaganవిశాఖపట్నం: దేవుని ఎదుట కూడా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబునాయుడు అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. వైసీసీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విశాఖపట్నంలో సోమవారం నిర్వహించిన బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనలో బ్రాహ్మణులు పేదరికంలో అల్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. బ్రాహ్మణులు .. ప్రజలకు దేవుడికి మధ్య వారధిలాంటి వారన్నారు. ఎన్నికల సమ యంలో చంద్రబాబు అనేక హామీలిచ్చారని వాటిని ఇప్పటివరకు అమలు చేయలే దని మండిపడ్డారు. పేద బ్రాహ్మణులకు ఐదు వేలు ఆర్థిక సాయం చేస్తామని బాబు హామీ ఇచ్చారని, ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. రమణ దీక్షితుల్ని అన్యా యంగా పదవి నుంచి తొలగించారన్నారు. బ్రాహ్మణులకు కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదన్నారు. టీడీపీ నేతలు, దేవాలయాలకు సంబంధించిన ఆస్తులను దోచుకుంటున్నారని, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి సంబంధించిన 1100 ఎకరాల భూమిని సిద్ధార్ధ అనే ప్రైవేటు కాలేజీకి కేవలం లక్ష రూపాయాలకే కట్టబెట్టారని మండిపడ్డారు దేవుడి ముందు కూడా అబద్దాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు మాత్రమేనని, గుడిని, గుడిలోని లింగాన్నీ కూడా దోచుకుంటారని అన్నారు. 

English Title
The appropriate position for Brahmins
Related News