కేరళకు ఏఆర్ రెహమాన్ భారీ విరాళం

Updated By ManamMon, 09/03/2018 - 15:22
AR Rahman

AR Rahmanభారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ భారీ విరాళం అందించారు. తన బృందంతో కలిసి కోటి రూపాయలను కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నట్లు రెహమాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం రెహమాన్ అమెరికాలో మ్యూజిక్ కన్సర్ట్స్ నిర్వహిస్తుండగా.. ఈ సందర్భంగా కేరళకు సాయం అందిస్తున్న విషయాన్ని వేదికపై ప్రకటించారు. ‘‘నేను, నా ఆర్టిస్టులు అమెరికా టూర్‌లో పాల్గొన్నాం. కేరళ వాసులకు మా వంతు సాయం చేశాం. ఈ చిన్న విరాళం మీకు కాస్త ఊరట ఇస్తుందని భావిస్తున్నా’’ అంటూ రెహమాన్ పోస్ట్ చేశారు. కాగా కేరళ కోసం అమెరికా కన్సర్ట్‌లో ఏఆర్ రెహమాన్ కేరళ కేరళ డోన్డ్ వర్రీ కేరళ.. కాలం మన నేస్తం అంటూ పాడి అందరిలో సామాజిక స్పృహను కలిపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే చిరంజీవి, షారూక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రజనీకాంత్, మమ్ముట్టి, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, విజయ్ సేతుపతి, సిద్ధార్థ్, ధనుష్, అనుపమ పరమేశ్వరన్, విశాల్ తదితరుల సినీ ప్రముఖులకు కేరళకు విరాళాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 

 

English Title
AR Rahman donates 1 crore to Kerala CMO
Related News