వెంటపడ్డానా.. నరికేస్తా

Updated By ManamWed, 08/15/2018 - 09:10
NTR

NTRఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ టీజర్ తెరకెక్కగా.. అదిరిపోయే యాక్షన్‌ పర్ఫామెన్స్‌తో ఎన్టీఆర్ ఆకట్టుకుంటున్నాడు. ‘‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా..? మచ్చలపులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటుందో తెలుసా..? మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా’’ అనే జగపతిబాబు డైలాగ్‌లతో టీజర్ ప్రారంభం కాగా.. ‘‘కంటబడ్డావా కనికరిస్తానేమో, వెంటపడ్డానా, నరికేస్తా ఓబా’’ అంటూ ఎన్టీఆర్ అదరగొట్టాడు. అలాగే టీజర్‌లో సునీల్‌ కూడా ఉండటాన్ని గమనించవచ్చు. ఇక టీజర్‌కు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ కూడా అదిరింది.  అంతేకాదు మామూలుగా త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రాల టీజర్‌కు ఇది విభిన్నంగా ఉండటం విశేషం. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించగా.. నాగబాబు, ఈషారెబ్బా, జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని పతాకంపై నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Aravindha Smetha teaser talk
Related News