ఆ పిల్లలు మావోయిస్టులా?

Updated By ManamThu, 06/21/2018 - 02:19
image

imageతప్పిపోయిన పిల్లలను మావోయిస్టులుగా మహారాష్ట్ర ప్రభుత్వం చిత్రీకరిస్తోంది. ఈ మేరకు తమ పిల్లలను మావోయిస్టుల పేరుతో అంతమొందిస్తున్నారని అనేకమంది తల్లిదండ్రు లు విలపిస్తున్నారు. కానన్సూర్ గ్రామంలో పోలీసుల కాల్పులకు 40మంది హతుైలెన ఘటన తరువాత తమ పిల్లలు కనిపించడం లేదని ఏడు కుటుంబాల తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తమ గ్రామంలోకి పోలీసులు వచ్చినపుడుగానీ, తవును పోలీసుస్టేషన్‌కు రమ్మని పిలిచిన ప్రతిసారీ తమ పిల్లల ఆచూకీ తెలుస్తుందేమోనని ఎంతో ఆశతో ఎదురుచూడడం సాధారణైమెందని వారు విలపిస్తున్నారు. తమ పిల్లలు ఆచూకీలేకుండా పోయి రెండునెలలు గడిచిందని వారు చెబుతున్నారు.

 ఇప్పటికైనా వారికేైమెందో పోలీసులు చెబితే బాగుంటుందని అంటున్నారు. గట్టేపల్లి గ్రామానికి సమీపంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో కనీసం 40 మంది నక్సైటెట్లు మరణించారు. గడ్చిరోలి జిల్లాలో ఈతపల్లి తాలూకా పరిధిలో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన ఎనిమిది మంది పిల్లలు దాదాపు రెండునెలల క్రితం కానన్సూర్ గ్రామంలో జరిగిన పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్లారు. అక్కడికి సమీపంలో ప్రవహిస్తున్న ఇంద్రావతి నదీ పరివాహిక ప్రాంతంలో ఏప్రిల్ 22న ‘50 మందికి పైగా గెరిల్లాల’పై పోలీసులు  కాల్పులు జరిపారు. ఆ గెరిల్లాలు ఆ పాంతంలో రాత్రి మకాంచేసిన విషయం తెలుసుకుని తాము వచ్చేసరికి కాల్పులకు గెరిల్లాలు తెగబడ్డారని, ఫలితంగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయుని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలోనే 34 మంది మృత్యువాత పడగా, ఆ మరుసటిరోజు కాండ్ల అటవీ ప్రాంతంలో మరో ఆరుగురు మరణించారు. మీడియాకు పోలీసులు విడుదల చేసిన ఫొటోలననుసరించి నది ఒడ్డున కనీసం ఇద్దరు పిల్లల మృతదేహాలున్నాయి. ఆ ఇద్దరి పిల్లల మృతదేహాలను తప్పిపోయిన పిల్లల గ్రూపులోని వారేనని చెబుతున్నారు. కానీ, ఒక మృతదేహాన్ని మాత్రమే కుటుంబ సభ్యులకు పోలీసులు అందజేశారు. మిగిలిన పిల్లల గురించి పోలీసులు పెదవి విప్పడం లేదని గ్రావుస్తులు ఆరోపిస్తున్నారు. 

పిల్లల అదృశ్యంపై మిస్టరీ కొనసాగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులకు పోలీసుల నుంచి బెదిరింపులు, హెచ్చరికలు వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ పిల్లలూ మావోయిస్టులేనని రాసివ్వాలని తల్లిదం డ్రులపై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారట. తమ పిల్లల హత్యలను సవుర్థించుకునేందుకు పోలీసులు ప్రయుత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నా రు. జూన్ 18న గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో గల పెరిమిలి సబ్ పోలీసు స్టేషన్‌లో హాజరుకావాలని ఐదుగురు తల్లిదండ్రులను పోలీసులు పిలిచారు. కొంతమంది గ్రావుస్తులతో కలిసి పోలీసు స్టేషన్‌కు ఆ ఐదుగురు తల్లిదండ్రులు వెళ్లారు. వారు పోలీసు స్టేషన్‌కు చేరీచేరుకోగానే ఐదుగురు తల్లిదండ్రులను మాత్రమే లోపలికి పోలీసులు అనువుతించి మిగిలిన గ్రావుస్తులను వెళ్లిపోవాలని ఆదేశించారు. తమను ఒక గదిలో ఉంచి నిశబ్దంగా ఉండాల్సిందిగా ఆదేశించారని వారు తెలిపారు. అప్పుడు వారికి ముందుగానే తయారుచేసిన కొన్ని కాగితాలను ఇచ్చి సంతకాలు చేయువుని ఒత్తిడి తెచ్చారట. ‘ఆ కాగితాలు మరాఠీలో రాయుబడి ఉన్నాయి. కానన్సూర్ గ్రామంలోని కమాండర్ సాయినాథ్‌ను కలవడానికి ఈ పిల్లలు వెళ్లారని అందులో ఉంది. ఈ కాగితంపై సంతకం చేయుడానికి నేను నిరాకరించినపుడు, నువ్వు కూడా చావాలనుకుంటున్నావా’ అని అడిగారని ఆ ఐదుగురికి చెందిన ఒకరు తెలిపారు. కాలేజీలో చదువుతున్న ఆయన కుమారుడు కూడా ఈ ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తవువుతున్నాయి. 

ఈ ఎనిమిది మంది పిల్లలు పెరిమిల్లి దళానికి కమాండర్ సాయినాథ్ అలియాస్ డోలేశ్ మధి ఆత్మారాం (32)కు సన్నిహితులుగా ఉన్నారని ఆ లేఖలో ఉందని గ్రావుస్తుల వల్ల తెలుస్తోంది. ఎదురుకాల్పుల్లో మరణించిన వారిలో సాయినాథ్ కూడా ఉన్నారు. ఆయునతో పాటు మరో ఇద్దరు డివిజన్ కమిటీ ర్యాంకు స్థాయికి చెందిన శ్రీను అలియాస్ శ్రీనాథ్, నందు ఉన్నారు. ఇంద్రావతి నది ఒడ్డున సాయినాథ్‌తో పాటు శ్రీను మృతదేహం లభించింది. నందు మృతదేహం మాత్రం ఏప్రిల్ 23న రాజారాం కాండ్ల అటవీ ప్రాంతంలోని కాపేవంచలో దొరికింది. తమను పోలీసుస్టేషన్లో కలుసుకున్న అధికారుల్లో ఇద్దరు యూనిఫారంలోను, మరో నలుగురు సివిల్ దుస్తుల్లోను ఉన్నారని గ్రావుస్తులు తెలిపారు. తమను కాగితాలపై సంతకం చేయాలంటూ దాదాపు నాలుగు గంటల పాటు ఒత్తిడిచేసి బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని వారు చెప్పారు. ఈ లేఖలను త్వరలోనే మేజిస్ట్రేట్ ఎదుట దాఖలుచేసి నేర శిక్షాస్మృతి 167వ సెక్షన్ కింద రికార్డు చేయించనున్నారని తెలుస్తోంది. తవుచేత సంతకం చేయించుకున్న ప్రకటన నకలును తమకు ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారని వారు ఆరోపించారు. ఈ అంశంలో వివరాలు తెలుసుకునేందుకు అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఎ.రాజాను ‘వైర్’ కలుసుకునేందుకు ప్రయుత్నించగా ఆయన అందబాటులోకి రాలేదు. కానన్సూర్‌లో జరిగిన ఎదురుకాల్పులకు సంబంధించి తాము ఏప్రిల్ 22 సాయంత్రం వరకు ఎలాంటి కాల్పుల శబ్దాలు వినలేదని గ్రావుస్తులు చెబుతున్నారు.

 ఏప్రిల్ 27న గ్రామాన్ని ‘వైర్’ ప్రతినిధి సందర్శించినపుడు ఫొటోలో కనిపిస్తున్న మృతదేహాల్లో ఒక పిల్లవాడి భౌతికకాయంగా గ్రావుస్తుడొకరు గుర్తించారు. ఆ బాలుడిని 16 ఏళ్ల  రాసు చాకో మాదవిగా స్థానిక న్యాయువాది, జిల్లా పరిషత్ సభ్యుడు లస్లు సోమా నగొటి గుర్తించారు. ఆ పిల్లవాడిని గుర్తించినప్పటికీ ఇంతవరకు అతని మృతదేహాన్ని పోలీసులు తమకు అప్పగించలేదని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. గతె్తపల్లి గ్రావుస్తులకు చీరెలు, పంచె లు, గొడుగులు, చెప్పులు, సబ్బులు, నిత్యావసర సామగ్రిని పోలీసులు పంచిపెడుతున్నారు. పిల్లల అదృశ్యంపై గ్రావుస్తుల్ని మంచిచేసుకునేందుకు ప్రయుత్నిస్తున్నారు. ‘మా వాళ్లను చంపిన తరువాత మమ్మల్ని మంచిచేసుకునేందుకు ప్రయుత్నిస్తున్నారా’ అని పోలీసులను గ్రావుస్తులు ప్రశ్నిస్తున్నా రు. ఈ అంశం తెలుసుకున్న తరువాత సామాజిక కార్యకర్తలు, న్యాయువాదులు, జర్నలిస్టులతో కూడిన 40 మంది బృందం గ్రామాన్ని సందర్శించింది. పోలీసుల వాదనను వారు సవాలు చేస్తున్నారు. పోలీసుల వైఖరిపై తాము హైకోర్టును ఆశ్రయించనున్నట్టు న్యాయువాది సురేంద్ర గాడ్లింగ్, సామాజిక కార్యకర్త మహేశ్ రౌత్ ప్రకటించారు. 

 - సుకన్యా శాంత
(వైర్ సౌజన్యం)

English Title
Are these children a Maoist?
Related News