దేశ భక్త గౌతమ్ గంభీర్

Updated By ManamFri, 01/26/2018 - 12:57
gambhir
goutham gambhir

మైదానంలో ఉన్నా...మైదానం బయట ఉన్నా దేశ భక్తిని చాటడంలో ఎప్పుడూ ముందుండే భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్. దేశ గణతంత్ర దినోత్సవ వేళ భారత ఆర్మీపై గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌ రిహార్సల్‌లో‌ పాల్గొన్న గంభీర్...తన తొలి ప్రేమ భారత ఆర్మీపైనేనని వెల్లడించారు. దేశ కోసం భారత ఆర్మీ సేనలు అందిస్తున్న సేవలు, త్యాగాలు అమోఘమని కొనియాడారు. 

భారత ఆర్మీలో చేరాలని తాను ఉవ్విళ్లూరినట్లు చెప్పారు. క్రికెటర్ కాని పక్షంలో తాను భారత సైనిక బలగాల్లో చేరి దేశానికి సేవలందించి ఉండేవాడినన్నారు. భారత సైన్యంలో చేరలేకపోవడం పట్ల చింతిస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. 

Related Articles: తొలి రిపబ్లిక్ డే ఫోటోలు చూశారా?

దేశంలోని ప్రతి ఒక్కరూ జాతీయ గీతాన్ని గౌరవించాలన్నారు. ఈ విషయంలో చర్చ అవకాశం లేదన్నాడు. జాతీయ గీతాన్ని గౌరవించని వారి నుంచి ఏమీ ఆశించలేమని వ్యాఖ్యానించాడు. జాతీయ గీతం పాడుతున్నప్పుడు లేచి నిలబడాలా? వద్దా? అనే చర్చ కూడా అవసరం లేదన్నాడు. 

English Title
Army is my first love, Gautam Gambhir rues not being a part of Indian Armed forces
Related News