డిపాజిటర్ల సంరక్షణే ధ్యేయం

Updated By ManamFri, 12/08/2017 - 19:02
arun jaitley, finance minister

arun jaitley, finance ministerన్యూఢిల్లీ: ప్రతిపాదిత ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లు డిపాజిటర్ల హక్కులను హరిస్తుందని వస్తున్న వార్తలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. నిజానికది, డిపాజిటర్ల హక్కులను సంరక్షిస్తుందని ఆయన అన్నారు. ‘‘ఫైనాన్షియల్ రిజల్యూషన్, డిపాజిట్ బీమా బిల్లు 2017 స్థాయి సంఘం వద్ద పెండింగ్‌లో ఉంది. ఫైనాన్షియల్ సంస్థల, డిపాజిటర్ల ప్రయోజనాలను పూర్తిగా సంరక్షించడమే ప్రభుత్వ ధ్యేయం’’ అని ఆయన ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఈ లక్ష్యానికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. డిపాజిటర్లకు ఇప్పుడున్న హక్కులను కాపాడాలనే ఎఫ్.ఆర్.డి.ఐ బిల్లు ప్రతిపాదిస్తోందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్.సి. గార్గ్ చెప్పారు. డిపాజిటర్లకున్న రక్షణ ‘‘నీరుగారడవున్నదేదీ లేదు. నిజానికిది, కొన్ని విధాలుగా ఇప్పుడున్న సంరక్షణలను మరింత కట్టుదిట్టం చేస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల డిపాజిటర్ల ముఖ్య గ్యారంటీ ప్రభుత్వ యాజమాన్యం నుంచి ఉంది. వారు దాచుకున్న మొత్తాలపై ఇది ఏమాత్రం ప్రభావం చూపబోదు’’ అని గార్గ్ చెప్పారు. ప్రభుత్వం ఫైనాన్షియల్ రిజల్యూషన్, డిపాజిట్ బీమా బిల్లు 2017ను గత ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అది పార్లమెంట్ సంయుక్త కమిటీ పరిశీలనలో ఉంది. ఫైనాన్షియల్ సర్వీసుల ప్రొవైడర్ల దివాలాతో వ్యవహరించేందుకు ఈ బిల్లు రూపొందించారు. ఒక పరిష్కార కార్పొరేషన్ ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. దివాలా తీస్తున్న సంస్థ ఆస్తులను మరో ఆరోగ్యకరైమెన ఫైనాన్షియల్ సంస్థకు బదలీ చేయడం, విలీనాలు, సమ్మేళనాలు, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆదేశం మేరకు లిక్విడేషన్ ప్రక్రియను చేపట్టడం వంటి అధికారాలను అది ఆ కార్పొరేషన్‌కు కల్పిస్తోంది. కొన్ని ముఖ్యైమెన ఫైనాన్షియల్ సంస్థలు విఫలైమెతే మొత్తం ఫైనాన్షియల్ వ్యవస్థ విచ్ఛిన్నవువుతుందని, అలా కాకుండా చూసేందుకు కొన్ని ఫైనాన్షియల్ ప్రొవైడర్లను నియుమించే అధికారం కూడా ఆ కార్పొరేషన్‌కు ఉందని బిల్లు ‘లక్ష్యాలు, కారణాల ప్రకటన’లో పేర్కొన్నారు. 

English Title
arun jaitley, finance minister
Related News