త్వరలోనే విధులకు జైట్లీ: గోయల్

Updated By ManamThu, 08/09/2018 - 16:55
Piyush Goyal
Piyush Goyal

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం బాగుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జైట్లీ త్వరలోనే విధులకు హాజరు అవుతారని ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన పేర్కొన్నారు. పీయూష్ గోయల్ గురువారం లోక్‌సభలో తన మంత్రిత్వ శాఖకు సంబంధించి రెండు తీర్మానాలు ప్రవేశపెడుతూ...‘ అరుణ్ జైట్లీ ఆరోగ్యంగానే ఉన్నారు.

ఆయన త్వరలో ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు తిరిగి తీసుకుంటారు’అని తెలిపారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా అరుణ్ జైట్లీ గురువారం సభకు హాజరయ్యారు. ఈనెల మూడో వారంలో జైట్లీ మళ్లీ ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను స్వీకరించనున్నారు. మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన చాలాకాలంగా ఇంటికే పరిమితం అయిన విషయం తెలిసిందే.

English Title
Arun Jaitley is in good health and will soon be resuming his duties, says Piyush Goyal
Related News