మళ్లీ ఆర్థిక మంత్రిగా జైట్లీ బాధ్యతలు

Updated By ManamFri, 08/03/2018 - 11:52
Arun Jaitley

Arun Jaitleyన్యూఢిల్లీ: ఆరోగ్య కారణాల రీత్యా గత మూడు నెలలుగా అధికారిక విధులకు దూరంగా ఉన్న కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ త్వరలోనే తిరిగి ఆర్థికశాఖ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆగష్టు రెండో వారం తర్వాత జైట్లీ విధుల్లోకి రానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 

మరోవైపు అరుణ్‌జైట్లీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నార్త్‌ బ్లాక్‌లోని ఆయన కార్యాలయానికి కొన్ని మరమ్మతులు చేపట్టారు. ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా 2014లో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరుణ్‌జైట్లీ.. ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగడంతో మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో.. మే నుంచి ఆయన విధులకు స్వల్ప విరామం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌కు తాత్కాలికంగా ఆర్థికశాఖ బాధ్యతలను స్వీకరించిన విషయం తెలిసిందే.

English Title
Arun Jaitley to resume work as Finance Minister
Related News