తిరిగి బాధ్యతలు చేపట్టిన జైట్లీ

Updated By ManamThu, 08/23/2018 - 12:17
arun jaitley

Arun Jaitley returns as Finance Minister three months after kidney transplantన్యూఢిల్లీ : మూడు నెలల విరామం అనంతరం అరుణ్ జైట్లీ  కేంద్ర ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది మే నెలలో మూత్రపిండాల శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన అప్పటి విశ్రాంతి తీసుకుంటున్న విషయం విదితమే. అయితే జైట్లీ ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశాలలో పాల్గొనేవారు. ఆపరేషన్‌ తర్వాత తొలిసారి జైట్లీ ఈ నెల తొమ్మిదిన జరిగిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొన్నారు.

గురువారం ఉదయం సెంట్రల్ సెక్రటేరియట్‌లోని నార్త్ బ్లాక్‌లోని తన కార్యాలయానికి వచ్చిన జైట్లీకి తిరిగి ఆర్థికమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. జైట్లీకి ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఆయన కార్యాలయాన్ని రినోవేట్ చేశారు. కాగా జైట్లీ విశ్రాంతి తీసుకున్న సమయంలో తాత్కాలికంగా ఆర్థిక శాఖ బాధ్యతలను రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ స్వీకరించారు. 

English Title
Arun Jaitley returns as Finance Minister three months after kidney transplant
Related News