ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్‌ రాజీనామా

Updated By ManamWed, 06/20/2018 - 16:12
Arvind Subramanian

న్యూఢిల్లీ :   ప్రధాన ఆర్థిక సలహాదారు పదవికి అరవింద్‌ సుబ్రమణియన్‌ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా వార్తను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. కాగా కుటుంబ కారణాల వల్ల తాను రాజీనామా అరవింద్ సుబ్రమణియన్ రాజీనామా చేశారని, తిరిగి ఆయన యూఎస్ వెళ్లిపోవాలనుకుంటున్నట్లు తనతో చెప్పారని జైట్లీ పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలు అయినా.. అది సుబ్రమణియన్‌కు చాలా ముఖ్యమని, దీంతో ఆయన నిర్ణయాన్ని కాదనలేకపోయినట్లు తెలిపారు.

Arvind Subramanian

సుబ్రమణియన్ 2014 అక్టోబర్‌లో దేశీయ ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమింపబడ్డారు. మూడేళ్ల కాలానికి గాను ఆయన, ఈ బాధ్యతలు చేపట్టారు.  అయితే అరవింద్‌ సుబ్రమణియన్ పదవీ కాలం గత ఏడాదే ముగిసినా, ఆ ఏడాది అక్టోబర్‌ వరకూ పొడిగించిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో ఆయన రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.

స్థూల ఆర్థిక అంశాలు, ప్రధాన బాధ్యతలు వంటి వాటికి ఆర్థికమంత్రికి సుబ్రమణియన్ సలహాదారుగా వ్యవహరించారు. రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రఘురామ్‌ రాజన్‌ నియమించబడటంతో, సుబ్రమణియన్ ఆయన స్థానంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

English Title
Arvind Subramanian quits as Chief Economic Advisor
Related News