దంపతులుగా అర‌వింద్ స్వామి, జ్యోతిక‌

Updated By ManamFri, 03/16/2018 - 19:54
ar

arvind‘రోజా’, ‘బొంబాయి’ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందుకున్న ద్వయం మణిరత్నం, అరవింద్ స్వామి. ప్రస్తుతం మణిరత్నం ఓ కుటుంబకథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అరవింద్ స్వామితో పాటు శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అదితిరావు హైదరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘నవాబ్’ గా తెలుగులో విడుదల కానున్న ఈ మల్టీస్టారర్ మూవీ.. ‘చెక్క చివంత వాణమ్’ పేరుతో తమిళంలో తెర‌కెక్కుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో అరవింద్ స్వామి, జ్యోతిక దంపతులుగా నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో జ్యోతిక సోదరి నగ్మాతో ‘మౌనం’ (1995)అనే తెలుగు సినిమాలో నటించిన అరవింద్ స్వామి.. దాదాపు 23 సంవత్సరాల తర్వాత జ్యోతికతో కలిసి ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం.

English Title
arvind swamy, jyothika as couples
Related News