నవంబర్‌లో ఎన్నికలు.. డిసెంబర్‌లో ఫలితాలు..

Updated By ManamThu, 09/06/2018 - 20:10
Assembly elections, November, Four states elections, TRS, KCR, Assembly dissolve
  • ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం

  • హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల ప్రచారం మొదలు.. 

  • డిసెంబరు మొదటి వారంలో ఎన్నికల ఫలితాలు

Assembly elections, November, Four states elections, TRS, KCR, Assembly dissolveహైదరాబాద్‌: నవంబర్‌లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అక్టోబర్‌లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నవంబర్‌లో ముగుస్తాయని వెల్లడించారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ‘‘టీఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నాం. మంచి సమయంలో చేస్తే అంతా మంచే జరుగుతుంది. చెడ్డ సమయంలో చెడ్డగానే జరుగుతుంది. 9న అమావాస్య. 7వ తేదీ శ్రావణమాసం శుక్రవారం మంచిరోజు. అదేరోజున ఒక సభను ప్రారంభిస్తాం. చెడురోజులు వచ్చేలోపు కార్యక్రమంతా ముగించుకోవాలి. ఎన్నికలు కూడా వీలైనంత తొందరగా వచ్చే అవకాశం ఉంది.

రాజ్యాంగం ప్రకారం కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి. అక్టోబర్‌ మొదటి వారంలో ఎన్నికల ప్రక్రియ మొదలై నోటిఫికేషన్‌ వస్తుంది. నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబరు మొదటి వారంలో ఎన్నికల ఫలితాలు ప్రకటించే అవకాశముంది. మీడియా చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని విషయాలు వెలుగులోకి రానివ్వలేదు. కేంద్ర ముఖ్య ఎన్నికల అధికారితో, మిగతా ఇద్దరు కమిషనర్లతో స్వయంగా మాట్లాడాను. ఆషామాషీగా చేయరు కదా. సీఎస్‌ ఎస్‌.కె.జోషి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ కూడా మాట్లాడారు. అన్ని విషయాలు చర్చించాకే ఈ నిర్ణయాన్ని వెల్లడించాం’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. 

English Title
Assembly elections on November of this year
Related News