నేటి రాశిఫలాలు ( బుధవారం 14 మార్చి )

Updated By ManamWed, 03/14/2018 - 01:09
astrology

imageమేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) 
స్నేహితులతో సంబంధాలు బలపడతాయి.  అవసరానికి తగినసాయం చేస్తారు. మీకిష్టమైన పనిని నలుగురితో కలసి చర్చించి మొదలుపెడతారు. ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు.
 

వృషభం

(కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2)
వృత్తి, వ్యాపార వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. ముఖ్యమైన వ్యహారంలో ఊహించని పురోగతి కనిపిస్తుంది. అరుదైన అవకాశం సద్వినియోగపరచుకుంటారు.
 

మిథునం

(మృగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3)
వివాదాలకు దూరంగా ఉండటం  మంచిది.  మీకు అందిన ఓ ఆహ్వానం సంతోషపెడుతుంది.  ఉద్యోగులకు కొత్త హోదాలు, బాధ్యతలు  లభిస్తాయి.
 

కర్కాటకం

(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఓ ముఖ్యమైన సమాచారం మీకందుతుంది.  ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి .  అవసరానికి డ బ్బు చేతికందుతుంది.  విలువైన వస్తువులను సేకరిస్తారు. 
 

సింహం

(మఖ, పుబ్బ, ఉత్తర 1)
పెట్టుబడులు,  రుణ వ్యవహారాల్లో కుటుంబ సభులు, సన్నిహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
 

కన్య

(ఉత్తర 2, 3, 4, హస్త, చిత్త 1, 2)
వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.  జీవితభాగస్వామి సలహాతో కొత్త పనులు ప్రారంభిస్తారు. అన్నింటా అనుకూలంగా ఉంటుంది.
 

తుల

(చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3)
ఆస్తి వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనులు తుదిదశకు వస్తాయి. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.  
 

వృశ్చికం

(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఓ ముఖ్య నిర్ణయం తీసుకోవటానికి అనుకూల సమయం.  స్థిరాస్తి, గృహయోగం ఉన్నాయి.
 

ధనస్సు

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
బంధువుల్లో ఒకరి ఆరోగ్యం కలవరపెడుతుంది.  వివాదాల జోలికి వెళ్లకుండా ఉండండి. వాహన, వస్త్ర లాభం ఉంటుంది.
 

మకరం

(ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ట 1, 2))
ఉద్యోగులకు పదోన్నతి కనిపిస్తుంది.  కొత్త చదువులపై ఆసక్తి కనిపిస్తుంది. పిల్లల  చదువు, భవిష్యత్ గురించి దీర్ఘాలోచనలుచేస్తారు. 
 

కుంభం

(ధనిష్ఠ 3, 4, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3)
చేపట్టిన పనుల్లో ఊహించని పురోగతి కనిపిస్తుంది. ముఖ్యనిర్ణయాల్లో తొందరపాటు వద్దు. స్థిరాస్థి వ్యవహారాలు పరిష్కారమవుతాయి.
 

మీనం

(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.

English Title
astrology
Related News