దినఫలం ( శుక్రవారం 16 ఫిబ్రవరి )

Updated By ManamFri, 02/16/2018 - 00:53
astrology

astrologyమేషం

(అశ్విని, భరణి, కృత్తిక 1)
అధికారుల నుంచి ప్రశంసలందుకుంటారు. ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది. ఆదాయం బాగున్నా ఖర్చులు మాత్రం పెరిగిపోతాయి. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమలు ఫలిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి.

వృషభం

(కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2)
ఆదాయం పెంచుకోవడానికి ప్రయుత్నాలు చేస్తారు. అయితే ఈ ప్రయుత్నాలు ఇప్పట్లో ఫలించే అవకాశం  లేదు. బంధువుల రాకపోకలు ఎక్కువవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక సంబంధాలు పెట్టుకోవద్దు. ప్రేమల్లో చిక్కులు తప్పకపోవచ్చు 

మిథునం

(మృగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 1. 2. 3)
పిల్లల చదువుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం జాగ్రత్త.
 
కర్కాటకం

(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)   
బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగానే ఉంటుంది. శుభ కార్యాల మీద డబ్బులు ఖర్చులు చేస్తారు.  బంధువులు ముఖం చాటేస్తారు. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రేమలు పరవాలేదు. 

సింహం

(మఖ, పుబ్బ, ఉత్తర 1, 2, 3)
ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. బంధుమిత్రులతో విభేదాలకు అవకాశం ఉంది. సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగంలో ఒత్తిడికి అవకాశం ఉంది. ప్రేవులకు ఇది సమయం కాదు. పిల్లలతో కాలక్షేపం చేస్తారు. 

కన్య

(ఉత్తర 4, హస్త, చిత్త 1, 2)
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయుటపడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగవద్దు. పెళ్లి ప్రయుత్నాలు సానుకూలపడతాయి. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. పని భారం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలకు అవరోధాలు తొలగిపోతాయి. 

తుల

(చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3)
ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. అధికారుల మెప్పు పొందుతారు. బదిలీకి అవకాశాలున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త వ్యాపారాల గురించి ఆలోచిస్తారు.  తీర్థయాత్రలు సంభవం. ప్రేమలు అనుకూలంగా ఉన్నాయి. ఇల్లు కొనాలనుకుంటారు. 

వృశ్చికం
(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆదాయం తగ్గే సూచనలున్నాయి. స్నేహితులు తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది.  దూర ప్రయాణ సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. 
 
ధనుస్సు

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
స్థాన చలనం సంభవం. పెళ్లి సంబంధాలు కుదరవచ్చు. ఏలిన్నాటి శని కారణంగా తరచూ అనారోగ్యం బాధిస్తుంటుంది. శనికి దీపం వెలిగించండి. ఉపశమనం లభిస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రేవులకు కాస్తంత దూరంగా ఉండండి. 

మకరం

(ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ట 1, 2)
ఆదాయానికి లోటుండదు. ఉద్యోగం మార్పు ప్రయుత్నాలు ఫలిస్తాయి. బదిలీకి, స్థాన చలనానికి అవకాశాలున్నాయి. తలచిన పనులు నెమ్మది మీద పూర్తవుతాయి. ప్రేమలు బెడిసికొట్ట వచ్చు. పెళ్లి సంబంధాలు కుదరడానికి అవకాశం ఉంది. బంధు మిత్రుల తాకిడి అధికంగా ఉంటుంది.  
 
కుంభం

(ధనిష్ఠ 3, 4, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3)
ఆదాయం బాగుంటుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయుత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పులు సంభవం. పెళ్లి బాజాలు మోగుతాయి. ప్రయాణాలకు అవకాశం ఉంది. పిల్లలు ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రేమలు ఫలిస్తాయి.  

మీనం

(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం నిలకడగా ఉంటుంది. సహోద్యోగులు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. ఆర్థిక లావాదేవీల విషయంలో వ్యాపారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం జాగ్రత్త. అతి కష్టం మీద పెళ్లి సంబంధాలు కుదురుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమలు ఒక కొలిక్కి వస్తాయి. 

Tags
English Title
ASTROLOGY
Related News