నేటి రాశిఫలాలు (ఆదివారం 18 ఫిబ్రవరి )

Updated By ManamSun, 02/18/2018 - 02:21
astrology

astrologyమేషం

(అశ్విని, భరణి, కృత్తిక 1)
అధికారుల మెప్పు పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారవువుతాయి.

వృషభం

(కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2)
ఆదాయం నిలకడగా ఉంటుంది. అయితే వృథా వ్యయం చేస్తారు. బదిలీకి అవకాశం ఉంది. ప్రమోషన్ వాయిదా పడుతుంది. కోర్టు కేసు పరిష్కారవువుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ప్రేమల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. పెళ్లి సంబంధాలు ఒక పట్టాన కుదరవు.

మిథునం

(మృగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 1. 2. 3)
ఆదాయానికి లోటు ఉండదు. ఖర్చులు ఆదాయానికి దీటుగా ఉంటాయి. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించినంత సహకారం లభించకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. పెళ్లి సంబంధాలు కుదరవచ్చు. కోర్టు కేసులు అనుకూలం. 
 
కర్కాటకం

(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)   
ఆదాయం బాగున్నా ఖర్చు పెరుగుతుంది. దూర ప్రాంతాలకు బదిలీ కావచ్చు. బంధుమిత్రులు ముఖం చాటేస్తారు. ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రేమలు, పెళ్లిళ్ల వ్యవహారాలు వాయిదా పడతాయి.

సింహం

(మఖ, పుబ్బ, ఉత్తర 1, 2, 3)
ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదు. ఖర్చులు పెరుగుతాయి. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ప్రేవు వ్యవహారాలు విజయువంతం కాకపోవచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన క లిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో విపరీతైమెన ఒత్త్తిడి ఉంటుంది.   

కన్య

(ఉత్తర 4, హస్త, చిత్త 1, 2)
ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్త. కోర్టు కేసులు సంతృప్తికరంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగకండి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. పెళ్లి సంబంధాలు కుదరవచ్చు. 

తుల

(చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3)
ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. బంధుమిత్రులు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. పెళ్లి సంబంధాలు కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఇంటి కోసం ప్లాన్ వేస్తారు. 

వృశ్చికం

(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
కుటుంబ సభ్యులతో విందుల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ వాయిదా పడతాయి. ఆదాయం బాగున్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు తగదు. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు.  
 
ధనుస్సు

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగం మారే ప్రయుత్నాలు చేస్తారు. ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఏలిన్నాటి శని ప్రభావం వల్ల ఆరోగ్యం మధ్య మధ్య చిరాకు పెడుతుంది. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. పెళ్లి బాజాలు మోగవచ్చు. ప్రేమకు దూరంగా ఉండండి. 

మకరం

(ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ట 1, 2)
ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ఖర్చులూ పెరుగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు మీకు ఇబ్బబందులు సృష్టించవచ్చు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి.  

కుంభం

(ధనిష్ఠ 3, 4, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3)
శుభ కార్యాల్లో విరివిగా పాల్గొంటారు. ప్రమోషన్‌కి, ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. బంధు మిత్రులకు సహాయం చేస్తారు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. పెళ్లి బాజాలు మోగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు చాలావరకు ఫలిస్తాయి. 

మీనం

(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
పెళ్లి సంబంధాలు కుదురుతాయి. శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. పిల్లల నుంచి సవుస్యలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలకు సిద్ధవువుతారు. ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.

English Title
astrology




Related News