నేటి రాశిఫలాలు ( మంగళవారం 20 ఫిబ్రవరి )

Updated By ManamTue, 02/20/2018 - 00:19
astrology

astrologyమేషం

(అశ్విని, భరణి, కృత్తిక 1)
పెళ్లి, ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగ పరిస్థితులు కూడా సానుకూలంగా ఉంటాయి. పిల్లలు మీరు సంతోషించే పనులు చేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కోర్టు వివాదాలు అనుకూలంగా పరిష్కారవువుతాయి.

వృషభం

(కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2)
పెళ్లి సంబంధాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన సహకారం లభించకపోవచ్చు. ఆదాయానికి లోటు ఉండదు కానీ, ఆరోగ్యం జాగ్రత్త. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ పరిస్థితులు నిరాశ కలిగిస్తాయి. కోర్టు కేసు వాయిదా పడుతుంది. 

మిధునం

(మృగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 1. 2. 3)
ఉద్యోగ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కానీ, అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఆదాయం బాగానే ఉంటుంది. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ, పెళ్లిళ్లకు అనుకూల సమయం. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. 
 
కర్కాటకం

(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)   
స్థాన చలనానికి అవకాశం ఉంది. ఇల్లు మారే ప్రయత్నం చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆరోగ్యం పరవాలేదు. బంధుమిత్రులు అవసరానికి ఆదుకోరు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రేమలకు దూరంగా ఉండాలి. 

సింహం

(మఖ, పుబ్బ, ఉత్తర 1, 2, 3)
ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మిత్రులతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. ఆవేశాలకు లోను కావద్దు. ఖర్చులకు కళ్లెం వేయాలి. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ప్రేవు వ్యవహారాలు విజయువంతం కాకపోవచ్చు. వృత్తి ఉద్యోగాలలో విపరీతైమెన ఒత్త్తిడి ఉంటుంది.   

కన్య

(ఉత్తర 4, హస్త, చిత్త 1, 2)
కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. విహార యాత్రకు బయులుదేరతారు. తరచూ ఆరోగ్య సవుస్యలు ఎదురవుతుంటాయి. కోర్టు కేసులు సంతృప్తికరంగా పరిష్కారం అవుతాయి. పని భారం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. 

తుల

(చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3)
వృత్తి ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. వ్యాపార రంగంలోని వారికి కలిసి వచ్చే కాలం. ప్రయాణాలు ఎక్కువవుతాయి. పెళ్లి సంబంధాలు కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహితులు స్వలాభానికి ఉపయోగించుకుంటారు. ఇంటి కోసం ప్లాన్ వేస్తారు. 

వృశ్చికం

(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఆదాయానికి లోటు ఉండదు కానీ, ఆరోగ్యం సంగతి చూసుకోవాల్సి ఉంటుంది. శుభ కార్యాలకు సంప్రదింపులు జరుపుతారు. దూర ప్రయాణ సూచనలున్నాయి. ప్రమోషన్ ఇప్పట్లో రాకపోవచ్చు. ప్రేమల్లో తొందరపాటు తగదు. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు.  
 
ధనస్సు

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ ప్రయుత్నాలు ముమ్మరం చేస్తారు. ఇల్లు మారడం సాధ్యం కాకపోవచ్చు. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువవుతాయి. ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. పెళ్లి బాజాలు మోగవచ్చు. ప్రేమలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

మకరం

(ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ట 1, 2)
స్థాన చలనం తప్పకపోవచ్చు. కొత్త ఉద్యోగంలో సవుస్యలు తలెత్తవచ్చు. ఆదాయం బాగున్నా ఖర్చులు పెరుగుతాయి.  ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు సృష్టించవచ్చు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ప్రయాణాలు తప్పవు. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి.  

కుంభం

(ధనిష్ఠ 3, 4, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3)
పెళ్లి సంబంధాలకు, ప్రేమ వ్యవహారాలకు అనుకూలైమెన సమయం. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలున్నాయి. ఆదాయం పెరుగుతుంది. బంధు మిత్రులకు సహాయం చేస్తారు. పిల్లలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. కోర్టు వ్యవహారాలు చాలావరకు ఫలిస్తాయి. 

మీనం

(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
పెళ్లి ప్రయుత్నాలు సఫలం అవుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. కింది ఉద్యోగులతో సవుస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. పిల్లల నుంచి సవుస్యలు ఎదురవుతాయి.

English Title
astrology
Related News