భౌతిక మార్పులను నిర్ణయించేదే జ్యోతిష్యం

Updated By ManamTue, 08/14/2018 - 01:57
astrology
  • శాస్త్రం తెలియని వారితోనే విశ్వసనీయత సన్నగిల్లుతుంది 

  • తర్కానికి అందనప్పుడే ప్రశ్న ఉదయిస్తుంది

  • కేసీఆర్‌కు తెల్సినందునే రాష్ట్రంలో పునరుజ్జీవం 

  • జ్యోతిష్య మహాసభల్లో మంత్రి జగదీష్ రెడ్డి

imageహెదరాబాద్: తెలంగాణా విద్వత్సభ అద్వర్యంలో రవీంద్రభారతిలో రెండు రోజుల పాటు జరిగే రాష్ట్ర జ్యోతిష్య మహాసభలను సోమవారం మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి ,జగదీష్ రెడ్డిలు ప్రారంభించారు. ఢిల్లీలో తెలంగాణా రాష్ట్ర ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి అధ్యక్షతన జరిగిన మహాసభలకు శ్రీ పుష్పగిరి మహాసంస్థానం పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకర్ భారతి స్వామి జ్యోతి ప్రజ్వలన చేశారు. దర్శనం పత్రిక ఎడిటర్ ఎం.వెంకట రమణశర్మ, ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయ ప్రజాసంబంధాల అధికారి వనం జ్వాలా నర్సింహా రావు ,జ్యోతిష్య పండితులు డాక్టర్ జ్ఞానేస్వర్ విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకమర్రి లక్ష్మీనాథాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ...భౌతికంగా జరిగే మార్పులను నిర్ణయించేదే జ్యోతిష్య శాస్త్రం అన్నారు. శాస్త్రం తెలియని వారు మాట్లాడుతూండడంతో శాస్త్రం మీద విశ్వసనీయత సన్న గిల్లుతుందన్నారు. తర్కానికి అందనప్పుడు ప్రశ్న ఉద్భవిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు విలువలకున్న విలువలు తెల్సినందునే రాష్ట్రంలో శాస్త్రానికి  పునరజ్జీవం కలిగిందన్నారు. భారతీయ విలువలు అంటేనే హిందుత్వ సంస్కృతితో కూడిన విలువల సమాహారమని స్పష్టంచేశారు. ఆర్ధికపరంగా... ఆయుధపరంగా సుసంపన్నం అయిన దేశాల ముందు  భారతదేశాన్ని సంస్కృతి సంప్రదాయాలు అత్యంత పటిష్టంగా నిలిపుతున్నాయన్నారు. 

Tags
English Title
Astrology determines physical changes
Related News