నేటి రాశిఫలాలు (బుధవారం 21 ఫిబ్రవరి)

Updated By ManamWed, 02/21/2018 - 03:43
astrology

astrology మేషం

(అశ్విని, భరణి, కృత్తిక 1)
పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మీకు అనుకూలైమెన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభ కార్యాలు జరపడానికి  సంప్రతింపులు సాగుతాయి. బంధువుల రాకపోకలు ఎక్కువవుతాయి. స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. 

వృషభం

(కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2)
ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోండి. ఆశించిన పనుల్లో కొద్దిగా ఆలస్యం తప్పదు. రావాల్సిన డబ్బు సవుయానికి చేతికి అందదు. అప్పు ఇవ్వొదు, తీసుకోవద్దు. ఎవరికీ గ్యారంటీ ఉండొద్దు. ఆరోగ్యం గురించి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే హాయిగా ఉంటారు.  

మిథునం

(మృగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 1. 2. 3)
ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటవుతుంది. అధికారులు మీకు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లిళ్లకు దారి తీయువచ్చు. పిల్లలకు సంబంధించి తీపి కబుర్లు వినే అవకాశం ఉంది. మిత్రుల్ని కూడగట్టుకుని ఎంజాయ్ చేసే సూచనలున్నాయి.

కర్కాటకం

(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)   
ఇష్టం లేని చోటుకి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఆదాయానికి లోటు లేకపోయినా ఖర్చులు మాత్రం పెరుగుతాయి. ఎంత తిరిగినా ఒక పట్టాన పనులు పూర్తి కావు. బంధువులు ముఖం చాటేస్తారు. మీ అనారోగ్యం అదుపులో ఉంటుంది. తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వస్తుంది. 

సింహం

(మఖ, పుబ్బ, ఉత్తర 1, 2, 3)
బంధు మిత్రులతో విభేదాలకు అవకాశం ఉంది. స్నేహితులు మిమ్మల్ని తమ స్వార్థానికి ఉపయోగించుకుంటారు. పెళ్లికి, ప్రేవులకు ఇది సమయం కాదని అర్థం చేసుకోండి. చివరి రూపాయి వరకూ ఖర్చు చేసి ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. 
 
కన్య

(ఉత్తర 4, హస్త, చిత్త 1, 2)
అదనపు సంపాదన కోసం ప్రయుత్నిస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. మీకు మీ కాబోయే జీవిత భాగస్వామి గురించి వివరాలు తెలుస్తాయి. ప్రేమకు అడ్డంకులు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో వాదోపవాదాలకు దిగకపోవడం మంచిది.

తుల

(చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3)
అధికారుల మెప్పు పొందుతారు. పని ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరవుతారు. బదిలీ అయ్యే సూచనలున్నాయి. పెళ్లికి ముహూర్తం పెట్టుకోవచ్చు. ప్రేమలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. తీర్థయాత్రలకు పథకాలు సిద్ధం చేస్తారు. సొంతగా ఇల్లు కొనాలనే ఆసక్తి పెరుగుతుంది.  

వృశ్చికం

(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఉద్యోగంలో పురోగతి సంభవం. ఆదాయానికి లోటుండదు. ఏలిన్నాటి శని కారణంగా ఏ పని తలపెట్టినా ఆలస్యం అవుతుంది. ఇంట్లో ప్రశాంతత తగ్గుతుంది. అప్పులు చేయాల్సి వస్తుంది. శనికి దీపం వెలిగిస్తే ఉపశమనం లభించవచ్చు. ప్రేమలో తొందరపడకూడదని తెలిసి వస్తుంది. 
 
ధనస్సు

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఇల్లు మారే అవకాశం ఉంది. ఖర్చులు తగ్గించుకోవాలి. బంధు మిత్రులతో విభేదాలు తలెత్తే సూచనలున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఎట్టకేలకు మీ తలుపు తడుతుంది. పెళ్లి బాజాలు మోగేందుకు ఇది సమయం. ప్రేమ వ్యవహారాలకు కాస్తంత దూరంగా ఉండండి. 

మకరం

(ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ట 1, 2)
ఉద్యోగం మారే అవకాశం ఉంది. పెళ్లికి డబ్బు సిద్ధం చేసుకోండి. ప్రేమలు బెడిసికొట్టే అవకాశం ఉంది. పిల్లల పురోగతి చూసి మురిసిపోతారు. జీవిత భాగస్వామితో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద ఓ కన్నేసి ఉంచండి. తిప్పట ఎక్కువగా ఉంటుంది. 

కుంభం

(ధనిష్ఠ 3, 4, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3)
శుభ కార్యాలకు హాజరవుతారు. అదనపు సంపాదనకు అవకాశాలు వస్తాయి. మీడియా, టూరిజం వంటి రంగాలకు అనుకూలంగా ఉంది. పెళ్లి బాజాలు మోగుతాయి. జీవిత భాగస్వామికి అడిగిందల్లా కొనిస్తారు. పిల్లలు మిమ్మల్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతారు. ప్రేమలు పెళ్లికి దారి తీస్తాయి. 

మీనం

(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం బాగున్నా చేతిలో డబ్బు నిలవదు. సహోద్యోగులు మిమ్మల్ని తప్పు దారి పట్టించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. పిల్లల మీద ఓ కన్నేసి ఉంచండి. పెళ్లి సంబంధాలు దగ్గర దాకా వచ్చి తప్పిపోతుంటాయి. ప్రేమ వ్యవహారాలు పరవాలేదు. 

English Title
astrology toadt (wednes day 21 february)
Related News