మరింత క్షీణించిన వాజ్‌పేయి ఆరోగ్యం

Updated By ManamThu, 08/16/2018 - 09:47
Vajpayee

Vajpayeeన్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఆరోగ్యంపై ఎయిమ్స్ డాక్టర్లు తాజా బులెటిన్‌ను విడుదల చేశారు. వాజ్‌పేయి ఆరోగ్యం చాలా క్షీణించిందని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. మూత్రపిండాలు, మూత్రనాళానికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌తో వాజ్‌పేయి బాధపడుతున్నారని, 24గంటల్లో ఆరోగ్యం చాలా క్షీణించిందని పేర్కొన్నారు. మరోవైపు ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ, బుధవారం ఆసుపత్రికి వెల్లి వాజ్‌పేయిని పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయధ్యక్షుడు అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు ఆసుపత్రికి వెళ్లి వాజ్‌పేయిని పరామర్శిస్తున్నారు.

English Title
Atal Bihari Vajpayee's condition critical
Related News