వాజ్‌పేయికి తుది వీడ్కోలు..

Updated By ManamFri, 08/17/2018 - 15:27
Atal Bihari Vajpayee's funeral, BJP HQ to Smriti Sthal, PM Narendra modi, amith shah (1426)
  • బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి అంతిమ యాత్ర.. ముగిసిన అంత్యక్రియలు

  • రాష్ట్రీయ స్మృతి స్థల్‌ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో తుదివీడ్కోలు

  • పాల్గొన్న విదేశీ ప్రముఖులు, బీజేపీ అగ్రనేతలు

Atal Bihari Vajpayee's funeral, BJP HQ to Smriti Sthal, PM Narendra modi, amith shah (1426)న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు ముగిశాయి. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో వాజ్‌పేయికి తుది వీడ్కోలు పలికారు. వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత భట్టాచార్య ఆయన చితికి నిప్పుంటించారు. వాజ్‌పేయి అంత్యక్రియల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఢిల్లీలోని దీన్‌దయాళ్‌ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఈ అంతిమ యాత్రలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సహా పలువురు అగ్రనేతలు పాల్గొన్నారు. 
Atal Bihari Vajpayee's funeral, BJP HQ to Smriti Sthal, PM Narendra modi, amith shah (1426)వాజ్‌పేయి పట్ల అమితమైన గౌరవభావం కలిగిన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ఎల్‌కే అద్వానీ, మధ్య ప్రదేశ్ సీఎం, మహారాష్ట్ర సీఎం సహా బీజేపీ అగ్రనేతలు వాజ్‌పేయి పార్థివదేహం వెంట నడుస్తూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మరోవైపు వాజ్‌పేయి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత్‌కు  పాక్ బృందం వస్తుండగా.. విదేశీ ప్రముఖులు భూటన్ రాజు జిగ్మే ఖేసర్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రులు సైతం ఆయన అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. 

Atal Bihari Vajpayee's funeral, BJP HQ to Smriti Sthal, PM Narendra modi, amith shah (1426)

విజయ్ ఘాట్ వద్ద మెమోరియల్ ఏర్పాటు.. 
విజయ్ ఘాట్ పక్కన 1.5 ఎకరాల్లో వాజ్‌పేయి మెమోరియల్ ఏర్పాటు చేశారు. వాజ్‌పేయి అంతిమ యాత్రలో ఆయన్ను కడసారి చూసేందుకు భారీసంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. వాజ్‌పేయి మృతికి సంతాపంగా 15 రాష్ట్రాలు సెలవుదినంగా ప్రకటించగా.. కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. ఏపీలోనూ 7 రోజుల పాటు సంతాప దినాలు జరుపుకోనున్నారు. అంతకుముందు వాజ్‌పేయి నివాసం నుంచి బీజేపీ కార్యాలయానికి చేరుకున్న నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేత ఎల్‌.కె.అద్వానీ, పలువురు కేంద్రమంత్రులు, అమిత్‌ షా, బీజేపీ అగ్రనేతలు వాజ్‌పేయి భౌతికకాయానికి నివాళులర్పించారు.

వాజ్‌పేయి అంతిమ యాత్ర ఫొటోలు

English Title
Atal Bihari Vajpayee's funeral begins from BJP HQ to Smriti Sthal
Related News