టీఎస్ ఐపాస్‌తో పెట్టుబడుల ఆకర్షణ

Updated By ManamThu, 02/15/2018 - 02:02
image
  • ఖమ్మం ఉక్కు పరిశ్రమకు సహకరించండి

  • ఇంటర్నేషన్ వైునింగ్ కాన్ఫరెన్స్‌లో కేటీఆర్ 

  • సమస్యలు పరిష్కరిస్తాం: నరేందర్‌సింగ్ తొమర్

  • భద్రతకు ప్రాధాన్యమివ్వండి: గవర్నర్ నరసింహన్

imageహైదరాబాద్: టీఎస్ ఐపాస్ ద్వారా వైునింగ్ రంగంలో పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. మైనింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఫిక్కీ , తెలంగాణ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వేషన్ సెంటర్‌లో (హెచ్‌ఐసీసీ) ఇంటర్నేషనల్ మైనింగ్ కాన్ఫరెన్స్ కమ్ ఎగ్జిబిషన్ బుధవారం ప్రారంభమయ్యింది. కేంద్ర గనుల శాఖ మంత్రి నరేంద్రసింగ్ తొమర్, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే తెలంగాణలో బొగ్గు గనులు అధికంగా ఉన్నాయున్నారు. గనుల్లో  పని చేసే కార్మికుల రక్షణ కోసం ఆధునికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని తెలిపారు. మైనింగ్ ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తుందన్నారు. ఖమ్మంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో అత్యుత్తమ ఇసుక పాలసీ అమలు చేస్తున్నామన్నారు. 2016-17 సంవత్సరానికిగాను మైనింగ్ రంగంలో రెవెన్యూ రూ.3,170 కోట్లు వచ్చిందని, 2017-18లో రూ. 3500 కోట్లు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. తెలంగాణలో ఖనిజాల తవ్వకాల్లో డ్రోన్, జియో ట్యాగింగ్ లాంటి టెక్నాలజీని ఉపయోగించాల్సిన అవసరముందన్నారు.

 ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తొమర్ మాట్లాడుతూ మైనింగ్ రంగం దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. దేశ జీడీపీలో మైనింగ్ రంగానిది అగ్రస్థానమని చెప్పారు. ఎక్కువ ఖనిజాలు ఉన్న చోటే పేదరికం కూడా ఉందన్నారు. ఈ అసమానతలను తొలగించాల్సిన అవసరముందన్నారు. మైనింగ్ శాఖ పారదర్శకంగా పనిచేస్తుందని, దేశంలో ఏరాష్ట్రంలోనైనా మైనింగ్ రంగంలో సమస్యలొస్తే కేంద్రం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. గనుల్లో పని చేసే కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మైనింగ్ వల్ల ప్రభావితమయ్యే గ్రామాల్లో ప్రజలకు సరైన పరిహారం ఇవ్వాలని సూచించారు. పరిహారం వివరాలు పారదర్శకంగా వెబ్‌సైట్లలో పెట్టాలన్నారు. మైనింగ్ వల్ల పర్యావరణానికి హాని కలుగకుండా చూసుకోవాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, సంపదతో ఆరోగ్యం రాదని సూచించారు. తెలంగాణలో మాదిరిగా ఇతర ప్రాంతాల్లో మైనింగ్ రంగంలో టెక్నాలజీని వాడుకోవాలన్నారు. దేశ, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను మైనింగ్ రంగం ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. తెలంగాణలో ఉన్న ఖనిజ సంపద వివరాలతో గనులు, భూగర్భ వనరుల శాఖ ప్రత్యేకంగా రూపొందించిన నివేదికను ఈ సదస్సులో గవర్నర్ ఆవిష్కరించారు.

English Title
Attraction of investments with TS Ipas
Related News