87 కోట్ల బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో లింకు

Updated By ManamMon, 03/05/2018 - 00:57
aadhar


aadharన్యూఢిల్లీ: ఇప్పటివరకు 80 శాతం బ్యాంకు ఖాతాలు, 60 శాతం మొబైల్ కనెక్షన్స్ ఆధార్‌తో అనుసంధానమయ్యాయని యూఐడీఏఐ సీనియర్ అధికారి ఆదివారం వెల్లడించారు. లెక్కలో లేని నల్లధనాన్ని వెలికితీసే ఉద్దేశంతో మార్చి 31, 2018 నాటికి ప్రతి బ్యాంకు ఖాతాదారుడు 12 నెంబర్లు కలిగిన ఆధార్ సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉద్దేశంతోనే పాన్‌కార్డును కూడా జతచేయాలని పేర్కొంది. మొబైల్ ఫోన్ వినియోగదారుల గుర్తింపు కోసం ఈ మార్చి 31 కల్లా మొబైల్ నంబర్లను ఆధార్‌తో తప్పనిసరిగా అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందాలంటే కొన్నింటికి ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడానికి సుప్రీంకోర్టు సైతం సుముఖంగా ఉంది. ఆ దిశలో పాన్ కార్డులకు, మొబైల్ సిమ్ కార్డులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశారు. ఇప్పుడు బ్యాంకు ఖాతాల విషయంలో పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 109.9 కోట్ల బ్యాంకు ఖాతాలుంటే అందులో 87 కోట్ల ఖాతాలు ఆధార్ సంఖ్యతో అనుసంధానం అయినట్లుగా యూఐడీఏఐ అధికారి చెప్పారు. ఇందులో 58 కోట్ల ఖాతాలకు సంబంధించి వెరిఫికేషన్ పూర్తికాగా మిగిలిన ఖాతాల విషయంలో బ్యాంకులకు పత్రాలు అందగా, వాటిని బ్యాంకు ఖాతా వివరాలతో అధికారులు సరిపోల్చి చూసే ప్రక్రియ సాగుతోందని ఆ అధికారి తెలిపారు.

Tags
English Title
Audar is Linguistic
Related News