283పరుగులు చేసిన టీమిండియా.. లీడ్‌లో ఆసీస్

Team India

పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌ను టీమిండియా 283పరుగుల వద్ద ముగించింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసిన ఆసీస్‌ 43పరుగుల ఆధిక్యంలో ఉండగా.. మరికాసేపట్లో రెండో ఇన్నింగ్స్‌కు ప్రారంభించనుంది ఆస్ట్రేలియా.

మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ, రహానే మినహా ఇతర ఏ భారత ఆటగాళ్లు రాణించలేదు. కోహ్లీ ఔట్ తరువాత టీమిండియా దూకుడుకు బ్రేక్ పడింది. పంత్ మినహా టెయిలెండర్లు నిలకడగా ఆడకపోవడంతో టీమిండియా 283 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

సంబంధిత వార్తలు