ఆటో డ్రైవర్ కుమార్తె...సందీప్ కౌర్ ‘బంగారం’

Updated By ManamTue, 09/25/2018 - 23:46
Sandeep Kaur

imageచండీగఢ్: పోలెండ్‌లో జరిగిన సెలిసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన సందీప్ కౌర్ ఓ పేదింటి అమ్మాయి. పోలెండ్‌లో జరిగిన ఈ టోర్నీలో 52 కిలోల కేటగిరి ఫైనల్లో ఆమె 5-0తో స్థానిక బాక్సర్ కరోలినా అంపుస్కను చిత్తు చేసింది. ఎవరికైనా సక్సెస్ అనేది అంత సులభంగా రాదు. పాటియాలాలోని హస్సన్‌పూర్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల సందీప్ కౌర్ కుటుంబంలోని ఆర్థిక సమస్యలతో నిత్యం పోరాడేది. ఆమెను బాక్సింగ్‌ను విడిచిపెట్టమని చుట్టు పక్కల వాళ్లు కౌర్ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చేవాళ్లు. కౌర్ తండ్రి సర్దార్

జస్వీర్ సింగ్ ఆటో డ్రైవర్. పాటియాలాలో ఆటో నడుపుతూ కుటుంబ అవసరాలను తీరుస్తున్నారు. దీంతో ఆ కుటుంబం ఎన్నడూ ఆకలితో నిద్రపోలేదు. అంతేకాకుండా కౌర్ కూడా ఆ క్రీడను వదలకుండునట్లు తండ్రి ఆండగా నిలిచాడు. కౌర్ బంధువు సిమ్రన్‌జిత్ సింగ్ తమ గ్రామంలోని అకాడమీలో బాక్సింగ్ చేసేవాడు. ఆయనే కౌర్‌కు స్ఫూర్తినిచ్చాడు. ‘నేను చిన్నగున్నప్పుడు మా అంకుల్‌తో కలిసి బాక్సింగ్ అకాడమీకి వెళ్లేదాన్ని. క్రమక్రమంగా బాక్సింగ్‌పై నాకు ఆసక్తి పెరిగింది. 8 ఏళ్ల వయసులో తొలిసారి బాక్సింగ్ గ్లోవ్స్ తొడిగి శిక్షణ ప్రారంభించాను’ అని కౌర్ వివరించింది. కోచ్ సునీల్ కుమార్ వద్ద కౌర్ శిక్షణ ప్రారంభించింది. ఆమె బాక్సింగ్‌ను ఎంచుకోవడంపై గ్రామంలోని వారంతా కౌర్ తల్లిదండ్రులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 
 

image

 

English Title
Auto driver's daughter ... Sandeep Kaur isgreat
Related News