'అ!'.. ఎప్పుడంటే..

Updated By ManamTue, 01/23/2018 - 16:50
awe

aweకాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యా మీన‌న్‌, రెజీనా, ఈషా రెబ్బా, ముర‌ళీ శ‌ర్మ‌, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'అ!'. ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ సినిమా.. వాల్‌పోస్ట‌ర్ సినిమా ప‌తాకంపై నాని స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కింది. ర‌వితేజ‌, నాని రెండు పాత్ర‌ల కోసం వాయిస్ ఓవ‌ర్ అందించిన ఈ మూవీని తొలుత ఫిబ్ర‌వ‌రి 2న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే అదే రోజు ర‌వితేజ కొత్త చిత్రం 'ట‌చ్ చేసి చూడు' విడుద‌ల కానుండ‌డంతో.. ఫిబ్ర‌వ‌రి 16కి ఈ సినిమాని వాయిదా వేశారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంది.

English Title
'awe' release date
Related News