వాట్సాప్‌లో చెల్లింపులకు సిద్దమవుతున్న యాక్సిస్

Updated By ManamTue, 03/13/2018 - 21:42
axis bank

axis bankబెంగళూరు: ప్రాచుర్యం పొందిన చాటింగ్ అప్లికేషన్ ‘వాట్సాప్’పై చెల్లింపులను ప్రాసెస్ చేసే స్థితికి త్వరలో చేరుకోనున్నట్లు భారతదేశపు మూడవ అతి పెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ మంగళవారం ప్రకటించింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యు.పి.ఐ)ని ‘‘పెద్ద అవకాశం’’గా యాక్సిస్ బ్యాంక్  అభివర్ణించింది. ‘‘యు.పి.ఐ విషయానికి వస్తే, నవకల్పనల విషయంలో మేం మార్కెట్ నాయకులం. యు.పి.ఐతో అవకాశాలు అపారంగా ఉన్నాయని  మేం నిజంగా విశ్వసిస్తున్నాం. మా ఖాతాదార్లకు భిన్నమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా మేం కృషి చేస్తున్నాం’’ అని యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రిటైల్ బ్యాంకింగ్) రాజీవ్ ఆనంద్ ఇక్కడ మీడియా ప్రతినిధులతో అన్నారు. ‘‘ కస్టమర్లు చెల్లింపులు జరిపేందుకు వీలుగా ఆవరణ వ్యవస్థను సృష్టించేందుకు మేం గూగుల్, వాట్సాప్, ఉబెర్, ఓలా, శామ్ సంగ్ పే వంటి భాగస్వాములతో కలసి పనిచేస్తున్నాం’’ అని ఆయన చెప్పారు. యు.పి.ఐ స్పేస్‌లో యాక్సిస్ బ్యాంక్ 20 శాతం మార్కెట్ వాటా కలిగి ఉందని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.  గూగుల్ టెజ్ ఇప్పటికే మొదలై పనిచేస్తోందని ఆ యన అన్నారు. ‘‘వాట్సాప్ విషయంలో, మేం ఇంటెగ్రేషన్ ప్రక్రియలో ఉన్నాం.

  వాట్సాప్ ప్రస్తుతం బేటా వెర్షన్ నడుపుతోంది. పూర్తి వెర్షన్ కూడా నడుపుతుంది...వచ్చే నెలలో లేదా మరో రెండు నెలల్లో అది కార్యరూపం ధరిస్తుందని మేం ఆశిస్తున్నాం’’ అని ఆయన అన్నారు. మొబైల్ బ్యాంకింగ్ వ్యయాలు 2017-18 ఆర్థిక సంవత్సరం క్యూ 3లో రూ. 51,030 కోట్లకు చేరాయని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. క్రితం ఆర్థిక సంవత్సరం అదే కాలంతో పోలిస్తే 71 శాతం పెరిగినట్లు లెక్కకు వస్తుందని పేర్కొంది. బ్యాంక్ లావాదేవీల్లో 66 శాతం ‘డిజిటల్ పద్ధతుల్లో’ సాగుతున్నాయని వెల్లడించింది. క్రెడిట్, డెబిట్ కార్డులు రెండింటిపైన బ్యాంక్ ప్రధాన దృష్టి కొనసాగుతోందని యాక్సిస్ తెలిపింది. ‘కార్డ్-యాక్సెప్‌టెన్స్ టెర్మినళ్ళ’ ఏర్పాటులో (4,79,200 పైనే) మార్కెట్‌లో నాయకత్వ స్థానంలో కొనసాగుతున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ప్రకటించుకుంది. 

Tags
English Title
Axis Bank to be able to process payments over WhatsApp soon
Related News