ఆయుష్మాన్ భవ?

Updated By ManamWed, 09/26/2018 - 01:30
Modi

తిండి, విద్య, వైద్యం, తాగునీరు అనేవి ప్రజల నిత్యావసరాలుగానే కాక ప్రాథమిక హక్కుగా గుర్తించి పరిపూర్తి చేయడం రాజ్యం విధి. అయితే ఆ ప్రాథమిక హక్కులన్నీ కేవలం మానవ అవసరాలుగా వర్గీకృతమవడంతో కార్పొరేట్ శక్తులకు భారీలాభాలను సంపాదించి పెడుతున్నాయి. పర్యవ సానంగా దేశంలో ప్రజారోగ్యం సంక్షోభంలోకి జారిపోయిన నేపథ్యంలో విశ్వజనీన వైద్యసేవలు ప్రజలకు తక్షణావసరంగా ముందుకొచ్చింది. నాలు గేళ్ళపాలనలో ఎన్నడూ ప్రజల ఆరోగ్యసంరక్షణ గురించి పెద్దగా ప్రస్తావిం చని ప్రధాని నరేంద్ర మోదీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సార్వజనీన ఆరోగ్యరక్షణ పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించారు.

దేశవ్యాప్తం గా ఉన్న పేదప్రజల ఆరోగ్య రక్షణకై ‘ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై)’ జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని జార్ఖ్‌ండ్ రాజధాని రాంచీలో మోదీ ఆదివారం ప్రారంభించారు. దేశంలో పదికోట్ల మంది కుటుంబాలకు (సుమారు 50 కోట్ల మంది ప్రజలకు) ఈ పథకం ద్వారా ఆరోగ్య భద్రత కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అమెరికా, కెనడా, మెక్సికోల జనాభా కంటే మనదేశంలో ఈ పథకం ద్వా రా లబ్ధిపొందబోయే జనాభా అధికమని మోదీ ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్‌కు ఇప్పటివరకు 27 రాష్ట్రాలు (కేంద్రపాలిత ప్రాంతాలు సహా) ఆ మోదం తెలిపాయి. కేరళ, తెలంగాణ, ఒడిషా, పంజాబ్, ఢిల్లీలు పీఎంజే ఏవై అమలుకు అంగీకారం తెలపలేదు. 

దేశంలోని పేదలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమాను కల్పించేందుకు కేం ద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆయుష్మాన్ పథకాన్ని తిర స్కరించిన ఐదు బీజేపీయేతర రాష్ట్రాలు తమ సొంత ఆరోగ్య పథకాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పేరుతో తా ము అమలు చేస్తున్న పథకమే మెరుగైనదని, ఆయుష్మాన్ భారత్ నిబం ధనలు కఠినంగా ఉన్నందున రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గే ప్రమాద ముందని తెలంగాణ ప్రభుత్వం గణాంకాలు సహా వెల్లడించింది. ఆయు ష్మాన్ భారత్ కార్యక్రమాన్ని మోదీ పేదల పాలిట సంజీవినిగా వర్ణిస్తుండ గా, దీన్ని సార్వత్రిక ఎన్నికల ముందు పథకం ప్రకారం చేస్తున్న ఒక పీఆర్ ఎక్సర్‌సైజ్‌గా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. సా మాజికార్థిక, కుల సూచికల ఆధారంగా జనాభాలో 40 శాతం మందికి ఆరోగ్య సంరక్షణ పథకాన్ని అందించాలన్న సంకల్పంతో రూపొందించిన మోదీ కేర్ ఎన్నికల విన్యాసంపై ప్రతిపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నా యి. ఈ పథకానికిగాను కేంద్రం కేటాయించిన రూ.2వేల కోట్లు ఏ మూ లకు సరిపోవు. కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకంలో భాగస్వాములయ్యేందుకు వెనకాడుతున్నాయి. నిధుల సమీకరణ సమస్య ఈ పథకాన్ని పొత్తిళ్లలోనే వెంటాడుతోంది. 

ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నడింపించాలని చూస్తున్న పీఎంజే ఏవై పథకం అమలుకు అత్యధిక స్థాయిలో వ్యయ నియంత్రణ అవసరం. లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ పథకం ఎలాగైతే కార్పొరేట్ ఆస్పత్రు లకు లాభదాయినిగా పరిణమించిందో మోదీ కేర్‌కు కూడా అదే గతి పట్టే ప్రమాదం లేకపోలేదు. పీఎంజేఏవైలో నిర్ణీత ధరలకు వివిధ రకాల వైద్య చికిత్సలు నిర్వహించవలసి ఉంటుంది. వైద్య వ్యయంపై ప్రభుత్వానికి, వై ద్య సంస్థలకు (ప్రభుత్వ, ప్రైవేట్) మధ్యవివాదం తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వం అందించే రేట్లు గిట్టుబాటు కావని అనేక ప్రైవేట్ వైద్య సంస్థలు ఆ పథకాన్ని అమలు చేయకుండా మొరాయించే అవకాశం లేకపోలేదు. ఇ ప్పుడున్న అరకొర నిధులు, మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరత వగై రా సమస్యలతో తల్లడిల్లుతున్న ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు ఆయుష్మాన్ సే వలను అందించలేవు. సరైన సన్నాహాలు లేని కారణంగా ఆయుష్మాన్ భార త్ అధికారయంత్రాంగం రేట్లను సమీక్షించే కార్యక్రమాన్ని ఇప్పుడు చేపట్టిం ది. 2010లో క్లీనికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం ప్రకారం రాష్ట్రాలే హాస్పిటల్ రంగాన్ని నిర్వహించడం పూర్తి కాకుం డానే  ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్ళు కాలయాపన చేసి, ఎన్నికల ముందు హడావుడిగా ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ప్రకటించడం పొరపాటు. వైద్య సంస్థల ప్రమాణాలను, వైద్య ప్రక్రియలకు హేతబద్ధమైన రేట్లను ఆ చట్టం నిర్ణయిస్తుంది. అయితే కొన్ని కీలక చికిత్సలు ప్రభుత్వ రంగ వైద్యసంస్థల ద్వారానే అందించాలని ఆయుష్మాన్ అధికార యంత్రాంగం ప్రకటించింది.

అయితే సుదీర్ఘకాలంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురై, నిర్వీర్యమై, శిథిలావస్థలో ఉ న్న ప్రజారోగ్య రంగం ద్వారా ఇది ఎంత మాత్రమూ సాధ్యం కాదు. ఇలా ఆలోచిస్తే ఆయుష్మాన్ అమలుకు అనేక అడ్డంకులు ఉన్నాయి. నిరోధక, ప్రా థమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని కేటాయించడం ద్వారా వాటిని అభివృద్ధి చేయగలిగితే ద్వితీయ, తృతీయ స్థాయి వైద్యకేంద్రాలపై కొంత ఒత్తిడి తగ్గుతుంది. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ పరిధిలో ఉన్న 1,50,000 ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలు ఆయుష్మాన్ పథకం అమలులో కీలకపాత్ర పోషించగలవు. ప్రభుత్వరంగ మౌలిక సదు పాయాలను అంచలంచెలుగా అభివృద్ధి పరచుకోవడమన్నది సార్వజనీన ఆరోగ్య సంరక్షణ కోసం ఒక కార్యచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు లో తొలి అడుగవుతుంది. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేవలం ఎన్నికల జుమ్లా (ఉత్తుత్తి హామీ)గా మార్చితే ప్రజలు క్షమించరు. 

English Title
Ayushman bhava
Related News