విశాఖ భూములపై బాబు కన్నేశారు

Updated By ManamWed, 09/05/2018 - 22:59
jagan
  • ఆయన అనుమతిస్తారు.. చినబాబు వసూళ్లు చేస్తారు

  • మాయ చేసి పెందుర్తిలో అసైన్డ్ భూములు కాజేశారు

  • సబ్బవరం బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి

jaganవిశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని భూములుపై చంద్రబాబు కన్నుపడిందని ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.  255వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖ జిల్లా సబ్బవరంలో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. రాష్ట్రంలో గజానికో కబ్జాకోరుని చంద్రబాబు తయారు చేశారని మండిపడ్డారు. అక్రమాలు చేయడానికి పెద్దబాబు అనుమతులిస్తే, చినబాబు కమీషన్‌లు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. రికార్డులు తారుమారు చేసి పెందుర్తిలో అసైన్డ్ భూములు కాజేశారన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల దగ్గర నుంచి భూములను లాక్కుని ప్రభుత్వానికి ఇచ్చారని తెలిపారు. మళ్లీ అవే భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని బాబు చెబుతున్నారన్నారు. భూ దందాలు చేస్తున్న టీడీపీ నాయకులకు చంద్రబాబు అండగా ఉంటున్నారన్నారు. దేశం మొత్తంలో 16 లా యూనివర్సిటీలు ఉండగా.. ఏపీలో ఒక యూనివర్సిటీ ఉండాలని వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టుబట్టారని, ఆయన చొరవతోనే సబ్బవరంలో దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ ఏర్పాటైందని వెల్లడించారు. పెందుర్తి నియోజకవర్గంలో మహిళపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. పెందుర్తి నియోజకవర్గం బుదిరెడ్డిపాలెం శివారు నుంచి బుధవారం 255వ రోజు జగన్ పాదయాత్రను ప్రారంభించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శిబిరంలో దివంగత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి జగన్ పూలమాల వేసి నివాళి అర్పించారు. తె అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతులు పలువురిని జగన్ సన్మానించారు. విశాఖపట్నంలోని కళా ఆస్పత్రి అధినేత, ప్రముఖ వైద్యుడు పైడి వెంకటరమణమూర్తి పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో బుధవారం వైసీపీలో చేరారు. విజయనగరం జిల్లాకు చెందిన బీజేపీ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఇందుకూరి రఘురాజు గుల్లేపల్లి వద్ద జగన్‌ను కలిసి ఆయన సమక్షంలో వైసీపీలో చేరారు. గుంటూరు జిల్లా పోలీసులు వేధింపులకు గురైన ముస్లిం యువకులు ఆదిరెడ్డిపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన శిబిరం వద్ద జగన్‌ను కలిశారు. సభలో ప్లకార్డులు ప్రదర్శించినందుకు తమను ఏ విధంగా వేధించారో. పోలీసులు ఎలా హింసాంచారో, ఇతరత్రా వివరాలను వారు జగన్‌కు తెలిపారు. 

English Title
Babu's eyes on Vishakha lands
Related News