ఎవరిని మభ్యపెట్టేందుకు బాబు దీక్ష

Updated By ManamSun, 04/15/2018 - 23:03
ambati
  • 20మంది ఎంపీలతో ఏం సాధించారు: అంబటి  

imageవిజయవాడ: కేంద్రం తీరుకు నిరసనగా దీక్ష చేస్తానని ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు తీరును వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ఎవరిని మభ్య పెట్టేందుకు దీక్ష చేస్తానంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రధాని దీక్షకు దిగితే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిం చిన చంద్రబాబే.. ఇప్పుడు దీక్షకు దిగడమేంటని ప్రశ్నించారు. 25మంది ఎంపీలను తమ పార్టీ తరపున గెలిపిస్తే హోదా తెస్తామంటున్న బాబు 20 మంది ఎంపీలను చేతిలో పెట్టుకుని ఏం సాధించారని ఆయన నిలదీశారు. పార్లమెంట్‌లో అవిశ్వాసం చర్చకు రాకుండా సభను వాయిదా వేసింది మోదీ అయితే రాష్ట్రానికి అన్యాయం జరగడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు అని అంబటి విమర్శించారు.

English Title
Babu's initiation to get rid of someone
Related News