సెమీస్‌లో సైనా, సింధు.. 

Updated By ManamSun, 08/26/2018 - 15:56
Asian Games 2018, Badminton, PV Sindhu, Saina Nehwal, semis, secure medals
  • ఆసియా క్రీడల్లో క్వార్టర్ ఫైనల్లో భారత షట్లర్లు విజయం.. 

  • 36ఏళ్ల తరువాత భారత్‌కు రెండు రజతాలు ఖాయం.. 

  • మహిళల సింగిల్స్‌లో పతకాలు సాధించడం తొలిసారి 

Asian Games 2018, Badminton, PV Sindhu, Saina Nehwal, semis, secure medalsజకర్తా: ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్‌లో భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళా సింగిల్స్ విభాగంలో భారత్‌కు మరో రెండు పతకాలను ఖాయం చేశారు.  ఆదివారం క్వార్టర్స్‌లో నాలుగో సీడ్‌ క్రీడాకారిణి, థాయ్‌లాండ్‌కు చెందిన రట్చనాక్‌పై 21-18, 21-16 తేడాతో వరుస గేమ్‌ల్లో సైనా నెహ్వాల్ గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. మరోవైపు మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు థాయ్‌లాండ్‌కు చెందిన జిండాపోల్‌తో హోరాహోరీగా పోరాడింది.

తొలి గేమ్ నుంచి దూకుడుగా ఆడిన సింధు జిండాపోల్‌‌కు ధీటుగా సమాధానమిచ్చింది. రెండో గేమ్‌లో అదే దూకుడును ప్రదర్శించిన సింధు ప్రత్యర్థి జిండాపోల్‌పై 21-11, 16-21, 21-14 తేడాతో విజయం సాధించి సెమీస్‌లో దూసుకెళ్లింది. తద్వారా మహిళల సింగిల్స్ విభాగంలో భారత్‌కు కనీసం రెండు రజతాలు ఖాయం అయినట్టే.  1982లో (36ఏళ్ల తర్వాత) భారత్‌కు మహిళల సింగిల్స్ విభాగంలో పతకాలు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. 

English Title
Badminton Highlights: PV Sindhu, Saina Nehwal reach semis, secure medals
Related News