కన్నడ మూవీపై కన్నేసిన బాలయ్య

Updated By ManamWed, 03/21/2018 - 12:26
balayya

balayyaరీమేక్‌లపై పెద్దగా ఆసక్తి చూపని బాలకృష్ణ తాజాగా ఓ కన్నడ మూవీపై కన్నేసినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన 'మఫ్టీ' చిత్ర రీమేక్‌లో నటించేందుకు బాలయ్య ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది. 'మఫ్టీ'లో శివ రాజ్‌కుమార్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించగా.. బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు అదే పాత్రలో నటించేందుకు బాలయ్య కూడా ఆసక్తిని చూపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా త్వరలో తెరకెక్కబోయే 'ఎన్టీఆర్‌' చిత్రంలో బాలయ్య నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించనున్నాడు.

English Title
Balakrishna eye on Mufti movie



Related News