రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డు

Updated By ManamSun, 09/23/2018 - 18:28
Balapur Ganesh, Laddu Record Price, Balapur ganesh laddu 

Balapur Ganesh, Laddu Record Price, Balapur ganesh laddu బాలాపూర్(హైదరాబాద్): బాలాపూర్ లడ్డు రికార్డు పలికింది. బొడ్రాయి వద్ద నిర్వహించిన బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటలో గత ఏడాది కంటే లక్ష ఎక్కువగానే పలకడం విశేషం. వేలంలో ఈ ఏడాది బాలాపూర్ గణనాథుడి లడ్డూను ఆర్యవైశ్య సంఘం 16 లక్షల 60వేలకు దక్కించుకుంది.

ఆర్యవైశ్య సంఘం తరఫున బాలాపూర్ వాసి టీ. శ్రీనివాస్ గుప్తా లడ్డూ అందుకున్నారు. లడ్డూ వేలం పాటకు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, వ్యాపార, వాణిజ్య, రాజకీయ ప్రముఖులు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 

English Title
Balapur Ganesh Laddu Record price
Related News