11 దేశాలపై నిషేధం ఎత్తివేత

Updated By ManamTue, 01/30/2018 - 22:02
donaldtrump
  • శరణార్థులకు అవెురికా తీపి కబురు

  • సమగ్ర పరిశీలన తర్వాత అనువుతి

donaldtrumpవాషింగ్టన్: డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక శరణార్థులు, వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్న అవెురికా.. అత్యంత ప్రమాదం పొంచివున్న 11 దేశాల ప్రజలకు తీపి కబురు ప్రకటించింది. ఈ దేశాలకు చెందిన శరణార్థుల రాకపై అమల్లో ఉన్న నిషేధాన్ని తొలగించింది. కాగా ఆయా దేశాల పౌరులు అవెురికాలోకి రావాలని కోరుకుంటే గతంలో కంటే పూర్తిగా వివరాలు పరిశీలించిన మీదటే అనువుతిస్తామని స్పష్టం చేసింది. 11 దేశాల పేర్లను అవెురికా వెల్లడించలేదు. ఈ జాబితాలో 10 ముస్లిం మెజార్టీ దేశాలు సహా ఉత్తర కొరియా ఉన్నట్టు తెలుస్తోంది. అవెురికా అంతర్గత భద్రత శాఖ మంత్రి కిర్‌స్టెన్ నీల్సన్ మాట్లాడుతూ.. ‘‘దేశంలోకి ఎవరెవరు వస్తున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మా శరణార్థుల వలస విధానంలో దుష్టశక్తులు దేశంలోకి చొరబడకుండా అదనపు భద్రత ప్రవుణాలు చేపట్టాం. అవెురికా అంతర్గత భద్రత కోసం కఠిన నిబంధనలు విధించాం’’ అని చెప్పారు. గత అక్టోబరులో శరణార్థుల వలసల విధానాన్ని సమీక్షించిన ట్రంప్ సర్కార్ ఈ 11 దేశాలపై నిషేధం విధించింది. కాగా అధికారికంగా ఆ దేశాల పేర్లను ప్రకటించలేదు. శరణార్థుల సంఘాలు మాత్రం ఈ జాబితాలో ఈజిప్టు, ఇరాన్, ఇరాక్, లిబియా, మాలి, ఉత్తర కొరియా, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్, సిరియా, యెమెన్ ఉన్నాయని పేర్కొన్నాయి. కాగా మతాన్ని (ముస్లింలు) లక్ష్యంగా చేసుకుని ఈ దేశాలపై నిషేధం విధించలేదని ఓ సీనియర్ అధికారి వివరించారు. అవెురికా అంతర్గత ముప్పును పరిగణనలోకి తీసుకునే ఆంక్షలు విధించినట్టు స్పష్టం చేశారు. కాగా బరాక్ ఒబామా పాలనలో 2017 ఏడాదికి గాను 1.10 లక్షల మంది శరణార్థులకు అవెురికాకు రావటానికి అనుమతి ఇవ్వగా.. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక ఈ సంఖ్యను 53 వేలకు తగ్గించింది. ఇక 2018 ఏడాదికిగాను ట్రంప్ సర్కార్ మరోసారి ఈ సంఖ్యను తగ్గిస్తూ 45 వేలమందికి పరిమితం చేసింది. 

English Title
Ban on 11 countries
Related News