ఏషియాలోనే అత్యుత్తమం బెంగళూరు

Updated By ManamWed, 09/19/2018 - 21:53
bangalore
  • మొత్తం 16 నగరాల్లో 7వ స్థానంలో హైదరాబాద్

 Bangalore is the best in Asiaన్యూఢిల్లీ: టెక్నాలజీ కార్యకలాపాల ప్రారంభానికికానీ లేదా విస్తరణకుకానీ మొత్తం ఏషియాలో బెంగళూరు అత్యుత్తమమైన నగరమని ప్రాపర్టీ కన్సల్టెంట్ కాలియర్స్ ఇంటర్నేషనల్ పేర్కొంది. ‘ఏషియాలో ఉన్నత నగరాలు: టెక్నాలజీ రంగం’ పేరిట ఆ సంస్థ ఒక పరిశోధనా నివేదికను విడుదల చేసింది. అభివృద్ధి చెందిన, ప్రవర్థమాన మార్కెట్లలోని 16 నగరాల స్థితిగతులను పరిశీలించింది. సామాజిక-ఆర్థిక, ఆస్తి, మానవాంశాలకు సంబంధించి దాదాపు 50 పరామితులను దృష్టిలో పెట్టుకుని టెక్నాలజీ కేంద్రాలుగా ఈ నగరాల ఆత్మనిర్భరతను ఈ నివేదిక నిర్ణయించింది. మొత్తం 16 నగరాల జాబితాలో హైదరాబాద్ 7వ స్థానంలో నిలవగా, 10వ స్థానంలో ముంబై, 11వ స్థానంలో ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం నిలిచాయి. ఏషియాలో టెక్నాలజీ ఆపరేషన్ల అంకురార్పణకు లేదా విస్తరణకు బెంగళూరు, సింగపూర్, షెన్‌జెన్‌లు ప్రీతిపాత్రమైన ప్రదేశాలుగా నిలిచాయి. ‘‘భారతదేశపు సిలికాన్ వ్యాలీగా ప్రాచుర్యం పొందిన బెంగళూరు టెక్నాలజీ సంస్థలకు ఏషియాలో నంబర్ 1 ఛాయిస్‌గా ఎంపికైంది’’ అని నివేదిక పేర్కొంది. బెంగళూరు శక్తి దాని సామాజిక-ఆర్థిక బలాలలో ఉంది. దాని సగటు వార్షిక జి.డి.పి వృద్ధి 2022 వరకు 9.6 శాతంగా ఉండవచ్చని అంచనా. అది దాన్ని ఏషియాలో వేగంగా వృద్ధి చెందుతున్న నగరంగా నిలుపుతోంది. విస్తృతమైన, గాఢమైన అనుభవంగల ప్రజ్ఞావంతుల నుంచి అది సహజంగానే ప్రయోజనం పొందుతోంది. 

‘‘జనాభాతో పోల్చుకుని చూస్తే సాపేక్షంగా దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాలలో కన్నా ఈ నగరం (బెంగళూ రు)లోనే ఉన్నత విద్యా సంస్థల సంఖ్య ఎక్కువ. సమాచా ర సాంకేతిక పరిజ్ఞాన రంగంలో నియమితుల య్యే అర్హత లున్నవారు 24 శాతం మంది ఉంటారు. దాంతో టెక్నాల జీ మొలక సంస్థలకు బెంగళూరు సహజ మైన చిరునామాగా పరిణమించింది. అక్కడి టెక్నాలజీ స్టార్టప్‌లు కడచిన మూడేళ్ళలో సగటున ఏటా 4 బిలియన్ డాలర్ల పెట్టుబ డులను ఆకర్షించాయి’’ అని కాలియర్స్ ఇంటర్నేషనల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జో వర్ఘీస్ చెప్పారు. టోక్యో తర్వాత ఎ గ్రేడ్ కార్యాలయ వసతి ప్రదేశం బెంగళూరులోనే ఎక్కువగా ఉంది. అది కూడా ఆ నగరానికి ఆధిక్యాన్ని కట్టబెడుతోంది. యాజ మాన్యాలకయ్యే వ్యయాలు తక్కువగా ఉన్నాయి. జీవన వ్యయానికి సంబంధించి ఖర్చులు తక్కువగా ఉండే టాప్ నగరాల్లో బెంగళూరు ఒకటిగా ఉంది. ర్యాంకింగ్‌లో బెంగళూరు 68 శాతం స్కోరు చేసి, మొత్తం మీద మొదటి స్థానంలో నిలిచింది. బహుళంగా ఉన్న మైక్రోమార్కెట్లలో 141 మిలియన్ చదరపుటడుగుల గ్రేడ్ ఎ కార్యాలయ వసతితో అది టోక్యో తర్వాత, రెండవ పెద్ద అర్బన్ ఆఫీస్ మార్కెట్‌గా నిలిచింది. అయితే, వృద్ధి చెందడానికి ఉన్న సామర్థ్యంతో 59 శాతం స్కోరుతో హైదరాబాద్ ఏడవ స్థానంలో నిలిచింది. సామాజిక-ఆర్థిక అంశాల రీత్యా మాత్రం అది తక్కువ స్థాయిలోనే ఉంది. ప్రతిభా వంతులను అందివ్వగలగడంలో అది బెంగళూరుతో సరితూగేదిగా లేదు. కానీ, పన్ను రేట్లు, జీవన వ్యయం హైదరాబాద్‌లో తక్కువే. మాన వాంశాలలో అది అనేక ఇతర భారతీయ నగరాలకన్నా మెరుగైన స్థితిలో ఉంది. మొత్తంమీద స్కోర్లలో 67.9 శాతమే అత్యధికమైనదిగా నిలువగా, 53 శాతం కనిష్ఠమైనదిగా నిలిచింది.

English Title
Bangalore is the best in Asia
Related News